అమరావతికి వరద ముప్పు: ఎంపీ గల్లా, రాజధాని ప్రమాదంపై బాబు అంగీకరించారా?

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వరద ముప్పు పొంచి ఉందా? నిన్నటి దాకా ఈ విషయం కొట్టి పారేసిన టిడిపి ప్రభుత్వం అవునని చెబుతోందా? అంటే అవుననే అంటున్నారు.

న్యూఢిల్లీ: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వరద ముప్పు పొంచి ఉందా? నిన్నటి దాకా ఈ విషయం కొట్టి పారేసిన టిడిపి ప్రభుత్వం అవునని చెబుతోందా? అంటే అవుననే అంటున్నారు. తాజాగా, టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ అమరావతికి వరద ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డారని అంటున్నారు.

అమరావతిలో 13,500 ఎకరాలకు వరద ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం దృష్టికి గల్లా జయదేవ్ తీసుకు వెళ్లారు. వరద ముంపుపై పర్యావరణవేత్తలు తొలి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు సర్కార్ దానిని కొట్టి పారేసింది.

galla jayadev

ఇప్పుడు టిడిపి నేతలు పరోక్షంగా అంగీకరిస్తున్నారని అంటున్నారు. వరద ముంపు నిర్వహణ నిమిత్తం రూ.1096 కోట్లు అవసరమని గల్లా జయదేవ్ లోకసభలో లేవనెత్తారు.

ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఆమోదం తెలపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రిజర్వాయర్ల నిర్మాణం, వరద నీరు మళ్లింపుకు వందల కోట్లు ఖర్చవుతుందని, ప్రపంచ బ్యాంకు రుణాల కోసం జలవనరుల శాఖకు ఫైలు పంపాలని టిడిపి ఎంపీలు కేంద్రాన్ని కోరుతున్నారట.

కాగా గల్లా జయదేవ్ వ్యాఖ్యల ద్వారా ఇక్కడ అమరావతి నిర్మాణం సరికాదని అర్థమవుతోందని అంటున్నారు. ప్రమాదాన్ని చంద్రబాబు సర్కార్ పరోక్షంగా అంగీకరించిందని తెలుస్తోందని అంటున్నారు.

జనవరికి మోడల్‌ పోలీస్‌స్టేషన్‌: డీజీపీ

వెలగపూడి నుంచే అన్ని కార్యకలాపాలు సాగుతుండటంతో మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఏపీ డీజీపీ సాంబశివ రావు తెలిపారు. గుంటూరులో నిర్మిస్తున్న మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ జనవరి నాటికి ప్రారంభిస్తామన్నారు.

గుంటూరులోని నగరపాలెంలో నిర్మిస్తున్న మోడల్‌ పోలీస్ స్టేషన్‌ను ఉన్నతాధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. దీని నిర్మాణం పూర్తయితే రాష్ట్రవ్యాప్తంగా 100 పోలీస్ స్టేషన్లు నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+