చంద్రబాబు ఉన్నారని సర్దుకున్నారు: నిర్లక్ష్యంపై బెజవాడ ఎంపీ అలక

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కృష్ణా జిల్లాకు చెందిన నేతలు ముఖ్య భూమిక పోషిస్తుంటారు. జిల్లాకు చెందిన నేతలు ప్రతి చిన్న విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అంతేకాదు జిల్లాకు చెందిన నేతలపై మీడియా అటెన్షన్ కూడా కాస్తంత ఎక్కువగానే ఉంటుంది.

అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న జిల్లాకు చెందిన నేతలు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా అధికార పార్టీకి చెందిన నేతలు రైల్వే అధికారులు అలిగారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నేతల అలకకు కారణం ఏంటో, బెజవాడ ప్రతినిధుల పట్ల అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారో తెలుసుకుందాం.

రైల్వేశాఖ హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతికి తరలివస్తున్న సచివాలయ ఉద్యోగుల కోసం విజయవాడ-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించినప్పుడు సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్‌ప్రభు పచ్చజెండా ఊపారు.

వాస్తవానికి ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని అధ్యక్షత వహించాల్సి ఉంది. రైల్వేశాఖ కార్యక్రమాలకు సర్వసాధారణంగా స్థానిక ఎంపీ అధ్యక్షత వహించడం అనేది సంప్రదాయంగా వస్తున్న ఆచారం కూడా. కానీ ఆ రోజు రైల్వే అధికారులు ప్రోటోకాల్‌ పాటించలేదు.

పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ఉండటంతో తెలుగుదేశం నేతలు "వివాదం ఎందుకులే'' అని సర్దుకున్నారు. అయితే తమ నిరసనను మాత్రం రైల్వే అధికారుల వద్ద తెలియచేశారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాటు జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఇది ఆనాడు జరిగిన సంగతి.

ఇక తాజా విషయానికి వస్తే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రైలును ప్రారంభించారు. ఏపీ తాత్కాలిక రాజధానిగా వ్యవహారిస్తోన్న విజయవాడ నుంచి అనంతపురం జిల్లా ధర్మవరం వెళ్లే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ఢిల్లీలో కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ ప్రభు రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు.

రైల్వే అధికారులపై అలిగిన బెజవాడ ఎంపీ కేశినేని నాని

రైల్వే అధికారులపై అలిగిన బెజవాడ ఎంపీ కేశినేని నాని


విజయవాడ రైల్వేస్టేషన్‌లో మొదటి ఫ్లాట్‌ఫాం నుంచి రైలు బయలుదేరే సమయంలో జరిగే వేడుకకి స్థానిక ప్రజాప్రతినిధులను రైల్వే అధికారులు ఆహ్వానించారు. జిల్లా మంత్రులు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, స్థానిక ఎమ్మెల్యేలు, నగర మేయర్‌కు ఈ మేరకు ఆహ్వానాలు అందినప్పటికీ వారెవ్వరూ ఈ కార్యక్రమానికి వెళ్లలేదు.

 రైల్వే అధికారులపై అలిగిన బెజవాడ ఎంపీ కేశినేని నాని

రైల్వే అధికారులపై అలిగిన బెజవాడ ఎంపీ కేశినేని నాని


దీంతో రైల్వే అధికారులే ఆ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాస్తవానికి ఆరోజు ఎంపీ నానితో పాటు మిగతా ప్రజాప్రతినిధులు విజయవాడలోనే ఉండటం విశేషం. అయినా సరే కార్యక్రమానికి ఎందుకు వెళ్లలేదని నిలదీస్తే,
అసలు విషయం వెలుగుచూసింది.

రైల్వే అధికారులపై అలిగిన బెజవాడ ఎంపీ కేశినేని నాని

రైల్వే అధికారులపై అలిగిన బెజవాడ ఎంపీ కేశినేని నాని


రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదనీ, ఎంపీకి ఇవ్వాల్సిన ప్రాధాన్యమేంటో కూడా వారికి తెలియడంలేదనీ టీడీపీ ప్రజాప్రతినిధులు చెప్పుకొచ్చారు. తమకు ప్రాధాన్యం లభించని చోటుకు ఎందుకు వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఆ కార్యక్రమానికి వెళ్లలేదని టీడీపీకి చెందిన ఓ నేత వెల్లడించారు.

 రైల్వే అధికారులపై అలిగిన బెజవాడ ఎంపీ కేశినేని నాని

రైల్వే అధికారులపై అలిగిన బెజవాడ ఎంపీ కేశినేని నాని

తమను నిర్లక్ష్యం చేస్తున్నారని పలుమార్లు రైల్వే అధికారుల దృష్టికి తెచ్చినా వారు పెడచెవిన పెడుతున్నారని ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఈ విషయమై రైల్వే ఉన్నతాధికారులకు, కేంద్ర రైల్వేశాఖ మంత్రికి లేఖ రాయాలని నిర్ణయించారు. ఇలా విజయవాడ- ధర్మవరం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవ కార్యక్రమం అధికారులకే పరిమితమైంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MP Kesineni nani not attended new rail inauguration in vijayawada station.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి