అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాకినాడ MLAపై MP కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ప్రజలకు ఎప్పుడూ తాను సాయం చేస్తూనే ఉంటానని చెప్పారు. కాకినాడ నుంచి సుల్తానా బేగం అనే మేడం ఫోన్ చేశారని, తన భర్త కరోనాతో మరణించడంతోపాటు తనకు ఇద్దరు పిల్లలున్నారని, ఒక ప్రయివేటు స్కూల్ లో పనిచేస్తున్నానని చెప్పారన్నారు. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతోపాటు ఇద్దరు పిల్లల్ని చూసుకోలేకపోతున్నట్లు చెప్పి బాధపడిందన్నారు.

తాను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోందని మాట్లాడితే అడ్రస్ చెప్పమ్మా.. డబ్బులు పంపిస్తాను.. అలాంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పానన్నారు. కాకినాడ ఎమ్మెల్యే గురించి ప్రస్తావిస్తే ఎన్నికలప్పుుడే ఆయన కనపడతారని తనతో చెప్పారని, తప్పకుండా తాను సహాయం చేస్తానని, పిల్లల్ని చదివిస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.ఉమ్మడి ఏపీని కలపడం సాధ్యం కాదని, అలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. రెండు రాష్ట్రాలు కలవడం భవిష్యత్తులో కూడా సాధ్యం కాదన్నారు.

 mp komatireddy venkata reddy comments on kakinada ysrcp mla

ముగ్గురు మెడికల్ విద్యార్థులకు రూ.75వేల ఆర్థిక సహాయం చేశానని, ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు వారికి ఆర్థికంగా అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. నల్లగొండ నియోజకవర్గం నుంచి ఇప్పటికి ఏ కష్టం వచ్చినా బాధితులు, స్థానికులు తనకే ఫోన్ చేస్తున్నారన్నారు. వారిని అన్ని రకాలుగా ఆదుకోవడంతోపాటు అండగా ఉంటానన్నారు.

నల్లగొండ నియోజకవర్గానికి తరుచుగా వస్తుంటానని, అందుబాటులో ఉంటానన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పార్టీ పదవుల్లో వేటిలోను నియమించలేదు. దీనిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని ముఖ్యమైన పదవులనే వదులుకున్నామని, అంతకంటే పార్టీ పదవులు గొప్పవికాదు అని వ్యాఖ్యానించారు.

English summary
Bhuvanagiri MP Komatireddy Venkatareddy's comments have now become interesting in political circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X