మళ్లీ మధ్యలోనే వెళ్లిపోయిన మాగంటి..! సీఎం సెక్యూరిటీ అడ్డుకోవడంతో
ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పుడు అడుగుపెట్టినా.. ఆయా కార్యక్రమాలకు హాజరవుతూ వస్తున్న ఎంపీ మాగంటి బాబు ఏదో ఒక గొడవ కారణంగా కార్యక్రమం మధ్యలోంచే వెళ్లిపోవడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా సీఎం సిబ్బంధి తీరుతో అసంతృప్తికి లోనైన ఆయన మరోసారి అలకబూనిట్టుగా తెలుస్తోంది.
బుధవారం నాడు సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన సందర్బంగా ఎంపీ మాగంటి బాబు కూడా హాజరయ్యారు. అయితే సీఎం కాన్వాయ్ కన్నా ముందు వెళ్తున్న మాగంటి వాహానాన్ని సీఎం సెక్యూరిటీ సిబ్బంధి అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంధి తీరుకు అసంతృప్తికి లోనైన మాగంటి, మధ్యలోనే వెళ్లిపోయారు. డ్రైవర్ ను సైతం పక్కనబెట్టి తానే స్వయంగా కారు నడిపించుకుంటూ అక్కడినుంచి నిష్క్రమించారు.

గతంలోను మాగంటి బాబు పలు కార్యక్రమాల మధ్యలోనే వెళ్లిపోవడం గమనార్హం. గత ఏప్రిల్ లో సీఎం చంద్రబాబు జిల్లాకు పర్యటనకు వచ్చిన సందర్బంలోను మాగంటి అలకబూనారు. సీఎం కంటే ముందే సభా ప్రాంగణానికి చేరుకున్న ఆయన, తానే స్వయంగా వేదిక మీదకు వెళ్లి స్థానిక ఎంపీపీలను, జెడ్పీటీసీలను వేదిక మీదకు రావాల్సిందిగా కోరారు.
అయితే అక్కడే ఉన్న పోలీసు అధికారులు మాగంటికి అభ్యంతరం చెప్పడంతో, ఎంపీపీలు, జెడ్పీటీసీలు వేదిక ఎక్కలేదు. ప్రోటోకాల్ నిబంధనలతో పోలీసులు మాగంటికి అభ్యంతరం చెప్పగా.. వాళ్లను వేదిక మీదకు పంపించాలంటూ మాగంటి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే పోలీసులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా లాభం లేకపోవడంతో అసంతృప్తికి లోనైన మాగంటి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications