హైకోర్టులో రఘురామ కేసు - విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి..!!

రఘురామ రాజు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకున్నారు.

తనపై నమోదు చేసిన రెండు కేసులను కొట్టివేయాలని ఎంపీ రఘురామ రాజు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేసారు. వీటిపైన అత్యవసర విచారణ జరపాలని రఘురామ రాజు తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర న్యాయమూర్తిని అభ్యర్దించారు. ఈ నెల 24న ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలంటే ఈ కేసులు అవరోధంగా ఉన్నాయని..పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని కోరారు.ఈ పిటీషన్లు జస్టిస్ కే శ్రీనివాస రెడ్డి బెంచ్ వద్దకు విచారణకు వచ్చాయి. ఇదే సమయంలో ఈ వ్యాజ్యాల నుంచి తాను తప్పుకుంటున్నట్లుగా న్యాయమూర్తి ప్రకటించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో తనపై నమోదు చేసినరెండు కేసులను కొట్టేయాలని రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీకి నియమితులైన కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం ఈ నెల 24న జరగనుంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరు కావాలంటే ఈ కేసులు అవరోధంగా పేర్కొన్నారు. ఈ పిటీషన్ల నుంచి తప్పుకుంటున్న ప్రకటించిన న్యాయమూర్తి జస్టిస్ కే శ్రీనివాస రెడ్డి కీలక సూచన చేసారు.ఎంపీ తరపు న్యాయవాది ఈ పిటీషన్లను వెంటనే విచారించాలని అభ్యర్ధిస్తున్న నేపథ్యంలో ఈ రోజు (గురువారం) తగిన బెంచ్ లో విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని జస్టిస్ శ్రీనివాస రెడ్డి రిజిస్ట్రీని ఆదేశించారు. ఎంపీ రఘురామ ప్రోద్భలంతోనే ఆయన మద్దతు దారులు విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీ రఘురామ పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.

MP Raghu Rama Raju has filed petitions in the High Court seeking dismissal of two cases registered against him

ఎంపీ రఘురామ అనుచరులు ర్యాలీలు చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తూ అల్లూరి సీతారామ రాజు జయంతి ఉత్సవాలను భగ్నం చేస్తున్నారని భూపతి వెంకట శ్రీనివాస రాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర పోలీసులు ఎంపీ రఘురామ పైన కేసు నమోదు చేసారు. ఇదే వ్యవహారంలో మరో వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాళ్ల పోలీసు స్టేషన్ లో మరో కేసు నమోదు అయింది. ఇప్పుడు ఈ రెండు కేసులు కొట్టి వేయాలని కోరుతూ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు మరో బెంచ్ ముందుకు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి సూచనతో.. ఈ రోజు రఘురామ దాఖలు చేసిన పిటీషన్లు న్యాయస్థానంలో విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+