• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రోతల్ హౌస్ ఓనర్ 2.0అవతారం, ఎల్లోలైట్ బ్రోకర్: అనిత, బుచ్చయ్యచౌదరిపై సాయిరెడ్డి బూతుపురాణం

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నోటికొచ్చిన బూతులన్నీ తిట్టాడు ఉంటూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. వీరి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలపై బూతు పురాణం అందుకున్నారు. బ్రోతల్ హౌస్, బ్రోకర్లు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేస్తూ .. ఆ మాటలు ఏంట్రా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యే గా గెలిపించిన ప్రజల్ని తిడుతున్నవా లేదా లక్షలాది ప్రజల ఆప్యాయతను అవమనిస్తున్నావా అంటూ మండిపడ్డారు. నువ్వేంట్రా.. దొంగ లెక్కలు వేసుకుని బుక్కు లో లెక్కలు మార్చి బుక్కయిన బ్రోకర్ వి అంటూ విజయసాయి రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నువ్వు కూడా మాట్లాడడం ఏంటో.. అని విజయసాయిరెడ్డి స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడు అంటూ ద్వజమెత్తారు.ఇదే సమయంలో ఢిల్లీ వెళ్తే ప్రతి ఒక్కరికి గేటు దగ్గర 2 వేల నోటు అంట కదా అంటూ ఎద్దేవా చేశారు. జాగ్రత మీ అల్లుడు బాబాయ్ వివేకానంద రెడ్డి కి పొడిచిన పోటు నీకు కూడా పొడుస్తాడేమో అని విజయసాయిరెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. కాస్త లేటు అవ్వొచ్చు ఏమో కాని గొడ్డలి పోటు తప్పదు ఏమో కసాయి రెడ్డి! అంటూ విజయసాయి రెడ్డి పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

MP Vijayasai reddy abusive words on vangalapudi anitha and gorantla butchaiah choudary

ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ విజయసాయిరెడ్డి ఏరా బుచ్చీ అంటూ రెచ్చిపోయారు. అశ్లీల బిట్లు చూసుకుంటూ అందరికీ ఫార్వార్డ్ చేసే ఎల్లో లైట్ బ్రోకర్ గాడివి అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ని టార్గెట్ చేశారు. గంజాయి పాత్రుడు అన్నట్లుగానే మహిళల బట్టలు ఊడదీస్తే...ఆ బిట్లు కూడా ఫార్వార్డ్ చేసి క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నావేంట్రా బుచ్చిగా? అంటూ అసభ్య పదజాలంతో దూషించారు.

ఇక ఇదే సమయంలో వంగలపూడి అనిత తాజాగా జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలలో తన 2.0 చూస్తావు అంటూ నిప్పులు చెరిగారు. నేను బంతి లాంటి దాన్ని. నువ్వు ఎంత గట్టిగా నేలకు కొడదాం అని చూస్తే అంతే వేగంగా పైకి లేస్తాను అని పేర్కొన్నారు. నేటి నుండి నా అగ్రెసివ్నెస్ 2.0 చూస్తావు. నువ్వు ఎన్ని గజ్జి కుక్కల్ని నా మీదకు వదులుతావో వదులుకో జగన్ రెడ్డీ. తగ్గేదీ లేదు, నీ అక్రమాలు, అన్యాయాలపై యుద్ధం ఆపేదీ లేదు అంటూ వంగలపూడి అనిత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

ఇక వంగలపూడి అనిత చేసిన పోస్టుకు సమాధానంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆమెపై అత్యంత దారుణంగా వ్యాఖ్యలు చేశారు. బాద్షా(Baadshah) సినిమాలో హీరోయిన్లా బంతి సిధ్ధాంతం చెప్పిన బ్రోతల్ హౌస్ ఓనర్ అంటూ మండిపడ్డారు. నీ 2.0 అవతారం మాకెందుకులేగానీ...నీ పార్టీ వాళ్ళే బంతిలా వాడుకుని వదిలేస్తారేమో చూసుకుంటూ సలహా ఇచ్చారు...అప్పుడు బాద్షా కాస్తా బాదూషా అయ్యి...0 అవుతుంది. 0 కూడా బంతిలానే ఉంటుంది. అంటూ విజయ సాయి రెడ్డి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

English summary
YSRCP MP Vijayasaireddy targeted Vangalapudi anitha as a brothel house owner. Saireddys lams Gorantla Butchaiah Choudary was a yellow light broker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X