Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రోడ్ సైడ్ రోమియోలా వెంటబడ్డా జనం నిన్ను ఏ సైడ్ నుంచీ లవ్ చేయరు చంద్రబాబూ: ఏకిపారేసిన సాయిరెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి ఎల్లో మీడియాపై సోషల్ మీడియా వేదికగా చిందులు తొక్కారు. చంద్రబాబు విసిరే ఎంగిలి మెతుకుల కోసం ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మీడియా ఛానల్ అధినేత ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన విజయ సాయి రెడ్డి చంద్రబాబు పెద్ద పాలేరుగా జీవితాంతం నీచమైన పనులు చేస్తూనే ఉంటావా నాయుడూ? అంటూ విమర్శించారు.

బ్రోకర్ వ్యవహారాలు నడిపే నువ్వు ఆకాశం మీద ఉమ్మితే అది నీ ముఖానే పడుతుంది

బ్రోకర్ వ్యవహారాలు నడిపే నువ్వు ఆకాశం మీద ఉమ్మితే అది నీ ముఖానే పడుతుంది

రఘురామకు పంపించిన మిలియన్ యూరోలు ఎక్కడివో? ఎవరిచ్చారో జవాబు చెప్పుకోవాల్సిన టైం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. బ్రోకర్ వ్యవహారాలు నడిపే నువ్వు ఆకాశం మీద ఉమ్మితే అది నీ ముఖానే పడుతుంది.

అయినా నీకంత సిగ్గెక్కడుందిలే? అంటూ విజయ సాయి రెడ్డి ఓ చానల్ అధినేత ను టార్గెట్ చేశారు. గతంలో రఘురామకృష్ణంరాజుతో ఓ మీడియా ఛానల్ యజమాని చేసిన వాట్సాప్ చాటింగ్ ను చర్చకు పెట్టిన విజయసాయిరెడ్డి ఇప్పుడు మళ్లీ ఆ చానల్ అధినేత పై విరుచుకుపడ్డారు.

బ్లాక్ మెయిల్ లేదంటే అడుక్కు తినడం అలవాటై కట్టుకథలతో అభాసుపాలవుతున్నావు

బ్లాక్ మెయిల్ లేదంటే అడుక్కు తినడం అలవాటై కట్టుకథలతో అభాసుపాలవుతున్నావు

'సుపారీ' వార్తలు ప్రచారంలో పెట్టాలని చూసినా ఒక లాజిక్ ఉండేలా చూసుకుంటారు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి బ్లాక్ మెయిల్ లేదంటేఅడుక్కు తినడం అలవాటైన ఆ నాయుడు మాత్రం కట్టుకథలను వదిలి అబాసు పాలవుతున్నాడని మండిపడ్డారు. బాబు పంపించే మూటలు అందితే ఏదైనా చేస్తాం, చూపిస్తాం అంటాడు మూలాలు మర్చిపోయిన నాయుడు అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. మరోవైపు 'పచ్చ'బాటలో నడుస్తూ ప్రభుత్వంపై విషం చిమ్మడం-ఆనక తమ ఎజెండాకు అడ్డువచ్చే నేతలపై బురద జల్లడం కొన్ని రోత ఛానళ్లకు రివాజైందని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.

జనాల ఉమ్మిలో కొట్టుకుపోతున్న నీ ‘యజమాని'ని ఒడ్డుకు లాగలేవు

జనాల ఉమ్మిలో కొట్టుకుపోతున్న నీ ‘యజమాని'ని ఒడ్డుకు లాగలేవు

గుడ్డకాల్చి ముఖాన వేస్తే వారే తుడుచుకుంటారులే అనుకుంటుంది మీడియా ముసుగేసుకున్న టీడీపీ కులగజ్జి చానల్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు చంద్రబాబు విసిరే ఎంగిలి మెతుకుల కోసం ఇంత నీచానికి దిగాలా అని ప్రశ్నించిన విజయసాయిరెడ్డి ఫైవ్, ఫైవ్ అంటూ రోడ్డు పక్కన ఇంకేదైనా చీకటి వ్యాపారం చేస్తే గిట్టుబాటు అవుతుందేమో చూడు అంటూ ఓ మీడియా ఛానల్ అధినేతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జర్నలిజం ముసుగులో టీవీ ఛానెల్ తో నీవు చేయగలిగింది ఏమీ లేదు. జనాల ఉమ్మిలో కొట్టుకుపోతున్న నీ 'యజమాని'ని ఒడ్డుకు లాగలేవు అంటూ చంద్రబాబు కోసం ఏం చేసినా, చంద్రబాబు గట్టెక్కే పరిస్థితి లేదని విజయసాయి తేల్చిచెప్పారు.

బోరు బావిలో పడ్డ పిల్లల్ని తీయొచ్చుకానీ నువ్వు మాత్రం బయటకు రాలేవు

బోరు బావిలో పడ్డ పిల్లల్ని తీయొచ్చుకానీ నువ్వు మాత్రం బయటకు రాలేవు

మనిషి జన్మ ఎత్తి, సిగ్గూ ఎగ్గూ వదిలేసి బురదలో దొర్లే జంతువులతో కలిసిపోయేవేంటి నాయుడూ? అంటూ చంద్రబాబు కోసం పని చేస్తున్నారని ఆ మీడియా ఛానల్ యజమానిపై విరుచుకుపడ్డారు. దేనికైనా కొన్ని హద్దులు, పరిమితులు ఉంటాయి. అన్నిటినీ దాటి ఊబిలోకి జారిపోయావు అంటూ విమర్శించారు. బోరు బావిలో పడ్డ పిల్లల్ని తీయొచ్చుకానీ నువ్వు మాత్రం బయటకు రాలేవు అంటూ తేల్చి చెప్పారు. అంతగా పతనమయ్యావని ఎద్దేవా చేశారు.

పొత్తులను లవ్ అఫైర్ల స్థాయికి దిగజార్చాడు 40 ఏళ్ల ఇండస్ట్రీ

పొత్తులను లవ్ అఫైర్ల స్థాయికి దిగజార్చాడు 40 ఏళ్ల ఇండస్ట్రీ

ఇక ఇదే సమయంలో తాజాగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పొత్తులపై చేసిన వన్ సైడ్ లవ్ వ్యాఖ్యలపై చంద్రబాబును టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు. రాజకీయ పార్టీల మధ్య పొత్తులను లవ్ అఫైర్ల స్థాయికి దిగజార్చాడు 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్ అంటూ బిత్తిరి మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి నువ్వు రోడ్ సైడ్ రోమియోలా వెంటపడ్డా నిన్ను ఏ సైడ్ నుంచీ జనం లవ్ చేయరు బాబూ అంటూ సెటైర్లు వేశారు. నిన్ను లవ్ చేసేది పచ్చ కుల మీడియా, నీ బినామీలే అంటూ విజయ సాయి రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

విలువల గురించి చంద్రబాబు ప్రవచనాలు చూస్తుంటే...దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది

విలువల గురించి చంద్రబాబు ప్రవచనాలు చూస్తుంటే...దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది

అంతకుముందు నోట్లకు అమ్ముడుపోయారంటూ కుప్పంలో జనంపై చంద్రబాబు చిందులేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు విజయసాయి రెడ్డి. ఓట్లు కొనదలచుకుంటే ఎంతైనా ఇవ్వగలడట! కానీ విలువలకు కట్టుబడి ఓట్లు కొనడట ఈ ఓటుకు నోటు సూత్రధారి అంటూ ఎద్దేవా చేశారు. విలువల గురించి చంద్రబాబు ప్రవచనాలు చూస్తుంటే...దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+