పురందేశ్వరి వర్సస్ సాయిరెడ్డి - ఢిల్లీ గేమ్, ఏం జరుగుతోంది..!?
ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ - జనసేన ఏకం అయ్యాయి. బీజేపీ ఏపీలో ఈ రెండు పార్టీలతో కలుస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. తెలంగాణలో బీజేపీ - జనసేన కలిసి ఎన్నికల్లొ పోటీ చేస్తున్నాయి. ఈ సమయంలోనే ఏపీలో ఇప్పుడు పురందేశ్వరి వర్సస్ వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఢిల్లీ సూచనలతోనే పురందేశ్వరి వైసీపీ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తున్నారా అనే చర్చ మొదలైంది.
పురందేశ్వరి టార్గెట్ చేసారా:కొద్ది రోజులుగా వైసీపీ పాలన పైన పురందేశ్వరి ఆరోపణలు కొనసాగిస్తున్నారు. లిక్కర్ వ్యవహారం పైన సాయిరెడ్డి లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేసారు. అదే స్థాయిలో సాయిరెడ్డి కౌంటర్ ఎటాక్ కొనసాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా పురందేశ్వరి వ్యవహరిస్తున్నారనేది వైసీపీ ముఖ్య నేతల ఆరోపణ. తాజాగా సాయిరెడ్డి కేసుల వ్యవహారం పైన సుప్రీం సీజేకు పురందేశ్వరి లేఖ రాసారు. దీని ద్వారా బీజేపీకి వైసీపీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నమా..లేక, సాయిరెడ్డి పైన వ్యక్తిగతంగానే పురందేశ్వరి ఈ తరహాలో రాజకీయ దాడి చేస్తున్నారా..ఇదంతా ఢిల్లీ ముఖ్య నేతల కనుసన్నట్లో జరుగుతుందా అనే చర్చ మొదలైంది.

సాయిరెడ్డి కౌంటర్:అయితే, వైసీపీ ముఖ్యులు మాత్రం ఇదంతా పురందేశ్వరి తనకు తానుగా చేస్తున్న రాజకీయంగా భావిస్తున్నారు. దీంతో, తాజాగా సాయిరెడ్డి మరోసారి పురందేశ్వరిని ఉద్దేశించి చేసిన ట్వీట్లలో సంచలన వ్యాఖ్యలు చేసారు. అందులో.. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులే. ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే, ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురందేశ్వరిది అని పేర్కొన్నారు. సిగ్గు విడిచి పదవీ కాంక్షతో అప్పట్లో బాబుగారి ఇంటికి వెళితే తలుపులు తెరవకుండా తరిమికొట్టినా మళ్లీ ఆయన పల్లకి మోస్తున్నారు ఈ ఆదర్శ దంపతులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. "అన్న టీడీపీ" అనే పార్టీని పురందేశ్వరి ప్రేరేపించి హరికృష్ణ చేత ప్రారంభించి, తనే కొబ్బరికాయ కొట్టి, కొంతకాలం గౌరవ అధ్యక్షురాలిగా పనిచేసి, ఆ పార్టీ ఓడిపోవటంతో కాంగ్రెస్ లో చేరి సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తిన ఘనురాలు ఈవిడ..అంటూ పోస్ట్ చేసారు.
1/3 :ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్రావులే. ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే, ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురందేశ్వరిది.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2023
పురందేశ్వరిపై ఆరోపణలు:దీనికి కొనసాంపుగా.. చూడు చిన్నమ్మా...పున్నమ్మా...పురందేశ్వరి! మీ పాదస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయింది. రాజకీయ, నైతిక విలువలంటూ ఏమి లేని మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి...అంతే నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జ్ గా అట్టర్ ఫ్లాప్ కావడంతో అక్కడా మిమ్మల్ని తీసేసారు..అంటూ సాయిరెడ్డి రాసుకొచ్చారు.
1/2: చూడు చిన్నమ్మా...పున్నమ్మా...పురందేశ్వరి! మీ పాదస్పర్శతో కాంగ్రెస్ పార్టీ పాతాళంలోకి పోయింది. రాజకీయ, నైతిక విలువలంటూ ఏమి లేని మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసి...అంతే నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఛత్తీస్ ఘడ్, ఒడిశా రాష్ట్రాల ఇంచార్జ్ గా అట్టర్…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2023
కష్టపడి పిత్రార్జితంగా మీకు వాటా వున్న టీడీపీనైనా బతికించుకుందామని చంద్రబాబు కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే...మీ ఎఫెక్ట్ తో చంద్రబాబు కూడా జైలుకు వెళ్ళడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పాపం! రెచ్చగొడుతున్న కొందరు కులపెద్దల చేతిలో ఇరుక్కుని మీరు వ్యక్తం చేస్తున్న ఫ్రస్ట్రేషన్ కు కాలమే సమాధానం..అంటూ సాయిరెడ్డి సోషల్ మీడియాలో పురందేశ్వరి లక్ష్యంగా పోస్టులు కొనసాగిస్తున్నారు.
నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి గారి వ్యక్తిత్వంలోనే ఉంది. తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారింది. ఇప్పుడు పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2023
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications