ప్రతిఫలంగా మేం మీకేమివ్వాలో చెప్పండి: చంద్రబాబుకు ముద్రగడ
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు.
విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. మమ్మలని మీరు ఓడించాలనుకుంటే మీరు ఓడిపోవడం ఖాయమని, మిమ్మల్ని ఓడించేందుకు మేము సిద్ధమని చంద్రబాబును హెచ్చరించారు.
చావో రేవో తప్ప తమ పోరాటానికి విరామం లేదన్నారు. మమ్మల్ని ఓడించే ప్రయత్నం చేస్తే మీరు ఓడిపోతారన్నారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటే మీకు మేం ఏమిచ్చుకోవాలో చెప్పాలన్నారు.

బీసీలను రెచ్చగొట్టే మానుకోవాలని హితవు పలికారు. తమ ఉద్యమానికి బీసీలతో పాటు గిరిజనులు, హరిజనులు అన్ని కులాల వారు మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. ప్రభుత్వ విధానానికి నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications