ప్రభుత్వ అధికారిక లాంఛనాలపై ముద్రగడ కుటుంబం అనూహ్య నిర్ణయం..!!

ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రిగా ప్రభుత్వం ముద్రగడ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముద్రగడ పద్మనాభం కుటుంబసభ్యులు తిరస్కరించారు. దీంతో..కిర్లంపూడి లోని ముద్రగడ నివాస ప్రాంగణంలోనే అంతక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆయన కుటుంబ సభ్యులు విభేదించారు. ముద్రగడ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించా లని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, బతికున్న సమయంలో ముద్రగడను అనేక విధాలుగా అవమానించారని.. ఇప్పడు అధికారిక గౌరవాలు, సానుభూతి అవసరం లేదని ముద్రగడ కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైసీపీ నేత జక్కంపూడి రాజా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ముద్రగడ అధికారం వెంట పరిగెత్తిన వ్యక్తి కాదని.. ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడు అని తెలిపారు. ఆయన బతికున్నప్పుడు ఇబ్బందులకు గురిచేసి.. ఇప్పుడు మరణించిన తర్వాత మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

Mudragada family members refuses state govt honour for Padmanabham final rites here the details

ముద్రగడ పద్మనాభం భౌతిక ఖాయాన్ని కిర్లింపూడిలోని ఆయన ఇంటికి తరలించారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఆయన కుమార్తె క్రాంతి చివరి చూపు కోసం కిర్లంపూడికి వచ్చే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. కుటుంబ సభ్యుల అభ్యంతరాలతోనే అడ్డుకున్నట్లు చెబుతున్నారు. కాగా, మంత్రులు.. పలువుకు కాపు సంఘాల నేతలతో పాటుగా ఆయన మద్దతు దారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ముద్రగడకు నివాళి అర్పిస్తున్నారు. మాజీ సీఎం జగన్ కిర్లంపూడిలో ముద్రగడకు నివాళి అర్పించి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ సాయంత్రం కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే అంత్య క్రియలు నిర్వహించాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+