ముద్రగడ కాపు ఉద్యమ ప్రచారం: మోహన్ బాబుతో భేటీ
హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల సాధన కోసం వివిధ పార్టీలకు చెందిన నాయకుల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నిస్తున్న కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారంనాడు ప్రముఖ సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోహన్ బాబును కలిశారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జల్‌పల్లిలోని ఫాంహౌస్‌లో హీరో మోహన్‌బాబును ఆయన కలిశారు. గత రెండు రోజులుగా ముద్రగడ పద్మనాభం పలువురు ప్రముుఖులను కలుస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిశారు.

ఇదివరకు ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ మంత్రి పల్లంరాజు ఫోన్‌లో మాట్లాడారు. ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావును, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ, కాంగ్రెసు నాయకులు రఘువీరా రెడ్డి, చిరంజీవిలను ఆయన కలిశారు.
ముద్రగడ పద్మనాభం తనకు సన్నిహితుడని మోహన్ బాబు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఆయన సూచన మేరకు కుమారుడు మంచు విష్ణు తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు.












Click it and Unblock the Notifications