ఏడాదిలో రూ.లక్షకు రూ.2.3 లక్షలిచ్చిన స్టాక్
స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం అంటేనే రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఆ రిస్క్ కు తగ్గట్లుగానే హైరిటర్న్స్ ఉంటాయి. అయితే ఎక్కువ సందర్భాల్లో నష్టాలే వస్తుంటాయి. షేర్ మార్కెట్ పై పూర్తి అవగాహన కలిగిన నిపుణుల సలహాలు తీసుకుంటుండాలి. అలా అయితేనే అనుకున్న లక్ష్యం దిశగా పయనించడానికి వీలుంటుంది.
మార్కెట్ లో పెట్టుబడిదారులను అతి తక్కువ సమయంలోనే మిలియనీర్లను చేసిన మల్టీబ్యాగర్ స్టాక్స్ చాలా ఉంటాయి. అలాంటి ఓ స్టాక్ సంవత్సర వ్యవధిలోనే ఇన్వెస్టర్ల దశ తిప్పింది. రూ.లక్ష పెట్టిన వారికి రూ. 2.3 లక్షలు వచ్చాయి. దాన్నిగురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదే ఎన్‌సీసీ లిమిటెడ్ (NCC Limited). గడిచిన సంవత్సర కాలంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. 2022 జులై 13న ఈ కంపెనీ స్టాక్ రూ. 58.20 వద్ద ఉంది. 2023 జులై 12 నాటికి రూ. 138.85 స్థాయికి చేరింది. 130 శాతం పెరిగింది. 12 నెలల క్రితం రూ. 1 లక్ష పెట్టుబడిగా పెట్టినట్లయితే దాని విలువ రూ. 2.30 లక్షలైంది.

ఎన్‌సీసీ లిమిటెడ్ కంపెనీ జూన్, 2023లో మొత్తం రూ.2,055 కోట్ల ఆర్డర్ అందుకుంది. బిల్డింగ్ డివిజన్ కోసం రూ. 1335 కోట్లు, ఎలక్ట్రికల్ డివిజన్ ఆర్డర్ రూ. 720 కోట్లుగా ఉంది. ఆర్థిక సంవత్సరంలో క్యూ4 ఫలితాల్లో ఆదాయం 42.32 శాతం పెరిగి రూ. 4949.03 కోట్లకు చేరింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ. 496.94 కోట్లుగా, కంపెనీ పీఏటీ రూ. 197.14 కోట్లుగా ఉంది. ఈరోజు ఈ స్టాక్ రూ. 135.60 వద్ద ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications