కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మున్సిపల్ పోలింగ్ ప్రారంభం - కుప్పంలో హోరా హోరీ : అదనపు బలగాలు - చంద్రబాబు సీరియస్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మున్సిపాల్టీలు... వార్డులకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా.. నెల్లూరు కార్పోరేషన్ తో పాటుగా 12 మున్సిపాల్టీలు.. 325 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 353 వార్డులకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. 28 వార్డులు ఏకగ్రీవం కావడంతో 325 స్థానాలకే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1,206 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8.62 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు నియోగించుకోనున్నారు. 908 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అందులో 398 కేంద్రాలను సమస్యాత్మకంగా, 262 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు.

ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా

ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా


527 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్‌ ఏర్పాట్లు చేశారు. కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో అదనపు బలగాలను మోహరించాలని, పోటీచేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి ఎస్‌ఈసీ ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు ఆదేశాలు, టీడీపీ అభ్యర్థుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడి పోలింగ్‌ స్టేషన్లలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లైవ్‌ వెబ్‌క్యాస్టింగ్‌, సీసీటీవీ రికార్డింగ్‌ చేయాలని నిర్దేశించింది. కుప్పం మున్సిపాలిటీలోని వార్డులన్నిటినీ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.

కుప్పం పైనే రాజకీయ ఆసక్తి

కుప్పం పైనే రాజకీయ ఆసక్తి


ఈ ఎన్నికల్లో ఇప్పుడు అందరి కళ్లు కుప్పం మీదే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఆధికత్య ప్రదర్శించింది. ఇక, ఎలాగైనా కుప్పం మున్సిపాల్టీ కైవసం చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో టీడీపీ అధినేత కుప్పం లో ఎన్నికల షెడ్యూల్ కు ముందు పర్యటించారు. ప్రచారం చివరి రెండు రోజులు లోకేశ్ కుప్పంలో మకాం వేసారు.పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు అక్కడ బాధ్యతలు అప్పగించారు. వైసీపీ నుంచి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ బాధ్యతలు తీసుకున్నారు.

చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి

చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి


ఇప్పటికే అక్కడ పరిస్థితుల పైన చంద్రబాబు పలు మార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. తాజాగా కుప్పంలో దొంగ ఓట్లు వేయించేందుకు బయటి ప్రాంతాల వారిని తీసుకొచ్చారని, వెంటనే వారందరినీ పంపించేసేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. తప్పుచేసిన వారిని వదిలేసి తెలుగుదేశం కార్యకర్తలపైనే పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు ఈ విషయంపై లేఖ రాశారు.

Recommended Video

AP MLC Elections : అభ్యర్ధుల ఎంపిక పూర్తి .. కొత్తగా 14 మంది ఖరారు..! || Oneindia Telugu
పల్నాడులోనూ హోరా హోరీగా

పల్నాడులోనూ హోరా హోరీగా


ఇక, పల్నాడు ప్రాంతంలోని ఎన్నిక సైతం ఉత్కంఠగా మారుతోంది. అక్కడ వైసీపీ..టీడీపీ నేతల సవాళ్ల మధ్య ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రేపు (మంగళవారం) జెడ్పీటీసీ - ఎంపీటీసీ పెండింగ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నెల 17న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో..ఇప్పుడు ప్రధానంగా కుప్పంలో ఓటింగ్..అక్కడి పరిణామాల పైన ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

English summary
Polling starts in nellore corporation and 12 municipalities alosn with pending wards. political tension created in Kuppam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X