పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చిన అధికారులు, పిఠాపురంలో పంచ్, డీసీఎం డిసైడ్ చేస్తారా?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. కాకినాడ జిల్లాలోని పిఠాపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు సీనియర్ అధికారులు ఒకరి మీద ఒకరు పరస్పరం దాడులు చేసుకోవడానికి ప్రయత్నించడం కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే ఆ ఇద్దరు అధికారులు బాహాబాహికి దిగడంతో అందరూ షాక్ అయ్యారు.

కౌన్సిల్ సమావేశంలోనే ఇలాంటి సంఘటన జరగడంతో సాటి అధికారులు, మునిసిపల్ ఉద్యోగులు, పిఠాపురం కౌన్సిల్ సభ్యులు బిత్తర పోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. పిఠాపురం నుండి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. పవన్ కళ్యాణ్ దెబ్బతో పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.

Mutual attacks between two officials in the Pithapuram Municipal Council meeting

అసెంబ్లీ ఎన్నికల సమయంలో పిఠాపురం పురపాలక సంఘం డీఈ భవాని శంకర్ ఆయన వ్యక్తిగత విషయాలపై చాలా రోజుల పాటు సెలవుపై వెళ్లారు. పిఠాపురం పురపాలక సంఘం కమిషనర్ గా కనకారావు బాధ్యతల్లో కొనసాగిస్తున్నారు. కొంతకాలంగా కమిషనర్ కనకారావు, డీఈ భవాని శంకర్ ల మధ్య విభేదాలు వచ్చాయి. ఇద్దరి మధ్య ఈ విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. డీఈ భవాని శంకర్ కార్యాలయంలో ఉండగానే కమిషనర్ కనకారావు ఈఈతో సంతకాలు చేయించుకోవడంతో వీరి మధ్య వివాదాలు, విభేదాలు ఇంకా ఎక్కువ అయ్యాయి.

ఇదే విషయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరుగుతోంది. శనివారం పిఠాపురం పురపాలక సంఘం సమావేశానికి కమిషనర్ కనకారావు, డీఈ భవాని శంకర్ హాజరైనారు. కౌన్సిల్ సమావేశం జరుగుతున్న సమయంలో ఓ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన కమిషనర్ కనకారావు, డీఈ భవాని శంకర్ పురుష పదజాలంతో ఒకరిని ఒకరు దూషించుకున్నారు.

ఆ తరువాత ఇద్దరూ సహనం కోల్పోయి ఒకరి మీద ఒకరు చెయ్యి చేసుకోవడానికి ప్రయత్నించారు. అప్పటికే షాక్ కు గురైన పిఠాపురం కౌన్సిల్ సభ్యులు, పురపాలక సంఘం ఉద్యోగులు ఇద్దరిని అక్కడ నుండి బయటకు పిలుచుకుని వెళ్లారు. పిఠాపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో ఈ సంఘటన జరగడంతో ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారుల విషయంలో ఇలాంటి చర్యలు తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+