వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా అమ్మ దెయ్యాల్ని వదిలించేది: టి డిప్యూటీ సిఎం

|
Google Oneindia TeluguNews

My mother demons to ward off: Rajaiah
హైదరాబాద్: తన తల్లి రాజమ్మకు ప్రతి శనివారం వేములవాడ రాజన్న పూనేవాడని, ఎవరైనా దెయ్యం పట్టిందన్న అనుమానంతో వస్తే.. త్రిశూలం చేతబూని దాన్ని వదిలించి వచ్చేదని తెలంగాణ డిప్యూటీ సిఎం తాటికొండ రాజయ్య చెప్పారు. ఇదేమని తన తల్లిని అడిగితే, రోగికి ముందు మానసికంగా చికిత్స చేయాలని చెప్పేదని ఆయన తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు.

తాను చేసేది ఏమీ లేదని ఆమెకూ తెలుసు, కానీ ఆనాటి పరిస్థితుల్లో అది తప్పలేదని రాజయ్య చెప్పారు. శుక్రవారం జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభ, తెలంగాణ పీపుల్స్ సైన్స్ కాంగ్రెస్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజయ్యతోపాటు ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. సామాజిక పరమైన అన్ని మూఢ నమ్మకాలకు విద్యే చక్కని మందు అని చెప్పారు.

ప్రజల మూఢ నమ్మకాలను సొమ్ము చేసుకునే వారిపై జనవిజ్ఞాన వేదిక దృష్టి సారించాలని సూచించారు. ఒకప్పుడు గుండె సంబంధిత వ్యాధులను పెద్ద జబ్బుగా భావించేవారని.. ఇప్పుడు మాత్రం డెంగా జ్వరం పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. కొన్ని ఆస్పత్రులు దీన్ని ఆసరాగా చేసుకుని రోగుల నుంచి ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నాగేశ్వర్, గేయానంద్, ప్రొఫెసర్ ఎం ఆదినారాయణ, జెవివి అధ్యక్షుడు ప్రొ. సత్యప్రసాద్, ప్రధాన కార్యదర్శి రమేష్, గౌరవ అధ్యక్షురాలు డా. మహతాబ్, ఎస్. బామ్జీ, నగర ప్రధాన కార్యదర్శి మాణిక్యాల రావు పాల్గొని ప్రసంగించారు.

English summary
Telangana Depurty CM Tatikonda Rajaiah on Friday said that his mother demons to ward off.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X