సంతృప్తి పరచదడానికే: కెసిఆర్‌పై మైసురా రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రజలను సంతృప్తిపరచడాకే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు పోలవరం ఆర్డినెన్స్‌పై బంద్‌కు పిలుపు ఇచ్చి ఉంటారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఎంవి మైసురా రెడ్డి వ్యాఖ్యానించారు. పోలవరం అర్డినెన్స్‌పై తెరాస ఇచ్చిన బంద్ పిలుపుపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పందించారు.

బంద్ అంశం తెరాస పార్టీకి సంబంధించిన వ్యవహారమని ఆయన అన్నారు. పోలవరం ముంపు ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయకపోతే బాధితులకు నష్టపరిహారం మంజూరు చేసే సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన అన్నారు.

Mysura Reddy supports Polavaram ordinance

పోలవరం ముంపు గ్రామాలపై కేంద్రం అర్డినెన్స్ ఇవ్వడంలో తప్పు లేదని ఆయన అన్నారు. గతంలో జూరాల ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ఇలాంటి సమస్య వచ్చిందని, అయితే, జూరాల ప్రాజెక్టు ముంపు బాధితులకు నష్టపరిహారం అందలేదని ఆయన చెప్పారు.

పోలవరం ముంపు గ్రామాలు గతంలో ఆంధ్రాలోనే ఉండేవని మైసురా రెడ్డి అన్నారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఆయన సమర్థించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+