గల్లా జయదేవ్ తప్పుకో: గ్రూపు రాజకీయాలపై చంద్రబాబు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్(ఏపీఓఏ) పదవి నుంచి తప్పుకోవాలని తెలుగుదేశం పార్లమెంటుసభ్యుడు గల్లా జయదేవ్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరినట్లు సమాచారం. ఏపీఓఏలోని రాజకీయాల కారణంగా 2018.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్(ఏపీఓఏ) పదవి నుంచి తప్పుకోవాలని తెలుగుదేశం పార్లమెంటుసభ్యుడు గల్లా జయదేవ్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఏపీఓఏలోని రాజకీయాల కారణంగా 2018లో జరిగే జాతీయ క్రీడల(నేషనల్ గేమ్స్)కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని ఏపీ కోల్పోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

చంద్రబాబు ఆగ్రహం
నేషనల్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని ఏపీ కోల్పోవడంపై చంద్రబాబు కొంత ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. ఏపీఓఏలో తెలుగుదేశం రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్, గల్లా జయదేవ్ వర్గం రాజకీయాలు తారస్థాయికి చేరుకోవడంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలిసింది.

తప్పుకున్న సీఎం రమేష్
కాగా, ఇప్పటికే సీఎం రమేష్ ఏపీఓఏ నుంచి వైదొలగగా, గల్లా మాత్రం కొనసాగుతున్నారు. అయితే, ఇండియన్ ఓలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అతని గ్రూపును గుర్తించింది. కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ(శాప్) మాత్రం ఈ గ్రూపులను గుర్తించేందుకు నిరాకరించింది.

గ్రూపు రాజకీయాలే..
గల్లా గ్రూప్ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్న కారణంగా నేషనల్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు బిడ్ వేయాలని ఐఓఏ కోరినప్పటికీ అది సాధ్యం కాలేదని శాప్ వైస్ ఛైర్‌పర్సన్ అండ్ ఎండీ జీ రేఖా రాణి తెలిపారు. కాగా, ఈ గ్రూపు రాజకీయాల కారణంగా నేషనల్ గేమ్స్‌కు ఏపీ ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్పోయింది.

మరోసారి గల్లా జయదేవ్‌కు తేల్చి చెప్పిన బాబు
ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి రాజకీయ నేతలు తమ ప్రాతినిథ్యాన్ని వదులుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. బాబు ఆదేశాలతో వెంటనే సీఎం రమేష్ తప్పుకోగా, గల్లా జయదేవ్ మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నారు. దీంతో గల్లా జయదేవ్‌ను ఒలింపిక్ గ్రూప్ నుంచి వైదొలగాలని చంద్రబాబు మరోసారి తేల్చి చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications