మీకు కూడా త్వరలోనే విరామం ప్రకటిస్తాంలే ఆగండి..!!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెందిన మంత్రులు జాతిరత్నాల్లా వ్యవహరిస్తున్నరాని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వారాహి వాహనం గురించి విమర్శలు చేస్తున్నారుకానీ తుపానువల్ల నష్టపోయిన రైతుల గురించి మాత్రం మాట్లాడటంలేదన్నారు. ఆక్వా రైతులు వైసీపీ విధానాలవల్ల పూర్తిగా దెబ్బతిన్నారని, పంటకు విరామం ఇచ్చారని, అలాకాకుండా త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి విరామం ఇస్తారని హెచ్చరించారు.
రైతు రైతు భరోసా కేంద్రాలు.. వైసీపీ కార్యాలయాలుగా రూపాంతరం చెందాయని ఆయన మండిపడ్డారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పొలం పనులు చేస్తూ ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన జనసేన క్రియాశీల కార్యకర్త శ్రీమన్నారాయణ కుటుంబాన్ని నాదెండ్ల పరామర్శించారు. నారాయణపురంలో శ్రీమన్నారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు బీమా పరిహారానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారికంగా 1,673 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జనసేన పార్టీ నుంచి లక్ష రూపాయల చొప్పున సాయం అందజేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 7 జిల్లాల్లో కౌలురైతు భరోసా యాత్ర పూర్తి చేశామని, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఈనెల 18న కౌలురైతు భరోసా యాత్ర చేపట్టబోతున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించే జేఎస్‌డబ్ల్యూ కంపెనీకి రూ.5వేల కోట్ల లబ్ధి చేకూర్చారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications