పవన్ అమ్మ ఆరోగ్యంపై తాజా అప్ డేట్

MLC Nagababu: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవి అనారోగ్యానికి గురయ్యారంటూ వచ్చిన వార్తలు మెగా కుటుంబంలో కలకలం రేపాయి. వారిని తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. ఆ వార్తలు నిరాధారమని తేలింది. అంజనాదేవి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టమైంది.

తొలుత ఈ ఉదయం అంజనాదేవి అనారోగ్యానికి గురయ్యారనే వార్తలొచ్చాయి. ఈ సమాచారం అందిన వెంటనే పవన్ కల్యాణ్.. రాజధాని అమరావతి నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో తన మంత్రివర్గ సమావేశాన్నీ అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు.

Nagababu given update on his mother s health

వెలగపూడి సచివాలయంలో ఈ ఉదయం మంత్రివర్గ సమావేశానికి హాజరైన ఆయన.. తల్లి అస్వస్థతకు గురయ్యారంటూ సమాచారం అందిన వెంటనే.. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇంటికి వెళ్లి అంజనా దేవిని పరామర్శించారు.

మరోవంక ఈ సమాచారం అందిన వెంటనే జనసేన నాయకుడు, శాసన మండలి సభ్యుడు నాగబాబు.. హుటాహుటిన ఇంటికి బయలుదేరి వెళ్లారు. తల్లిని పరామర్శించారు. దీనిపై తాజాగా ఆయన అప్ డేట్ ఇచ్చారు. అమ్మ ఆరోగ్యం బాగుందని వెల్లడించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ పై పోస్ట్ చేశారు.

అమ్మ ఎటువంటి అనారోగ్యానికీ, అస్వస్థతకూ గురి కాలేదని నాగబాబు తెలిపారు. అమ్మ ఆరోగ్యం చాలా బాగుందని పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించిందంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. దీనిపై తప్పుడు సమాచారం సర్కులేట్ అవుతోందని పేర్కొన్నారు. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం నాగబాబు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+