మీడియా రంగంలోకి నాగబాబు - పక్కా ఫ్యూచర్ ఫ్లాన్..!!
మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. రాజకీయంగా జనసేన ఏపీలో కీలకంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి ప్రభుత్వంలో భాగస్వామి అయింది. రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత బలోపేతం కావాలని భావిస్తోంది. ఇదే సమయంలో నాగబాబు కొత్తగా మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్ మీడియా ఎంటర్ టైన్మెంట్ పేరుతో లోగోను ఆవిష్కరించారు. పక్కా ప్రణాళికలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నాగబాబు మీడియా రంగంలోకి ఎంట్రీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొద్ది కాలం క్రితం వరకు సోషల్ మీడియా ద్వారా నాగబాబు తన అభిప్రాయాలను షేర్ చేసుకొనే వారు. ఏపీలో రాజకీయ పార్టీలకు మీడియా మద్దతు ఉంది. జనసేనకు సొంతంగా మీడియా వ్యవస్థ లేదు. ప్రస్తుతం1 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ ను నాగబాబు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్‌కే పరిమితమవుతారని, భవిష్యత్తులో పొలిటికల్ న్యూస్ కూడా ఉంటుందని చర్చ జరుగుతోంది.

నాగబాబు మీడియా రంగంలోకి రావటం వెనుక పక్కా వ్యూహం ఉందనే వాదనఉంది. ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్‌కే ప్రాధాన్యత ఇస్తూ ఛానల్ ప్రారంభించినా..రానున్న రోజల్లో పరిస్థితులకు అనుగుణంగా పొలిటికల్ న్యూస్ మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. టీడీపీ మద్దతు మీడియా ప్రస్తుతం జనసేనకు అనుకూలంగా ఉంది. కానీ, రాజకీయంగా ఎలాంటి పరిణామాలు అయినా చోటు చేసుకొనే అవకాశం ఉంటుందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో..రాజకీయంగా మరింత బలం పెంచుకోవాలనే వ్యూహాల్లో భాగంగానే మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications