జగన్ నూ వదలని మెగా బ్రదర్ .. లాజికల్ ప్రశ్నలేస్తున్న నాగబాబు

జనసేన పార్టీ నాయకుడు, నర్సాపూర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు బాగుంది జబర్దస్త్ పంచ్ లను వేయడంతోపాటు, లాజిక్ లు మాట్లాడుతున్నారు. అన్న మంత్రి నారా లోకేష్ ను రేలంగి తో పోల్చిన నాగబాబు ఇక తాజాగా జగన్ పైన లాజికల్ ప్రశ్నలు సంధించారు.

వైసీపీ నేతలతో జగన్ మాట్లాడిన వీడియో ... లాజికల్ ప్రశ్నలు వేసిన మెగా బ్రదర్

వైసీపీ నేతలతో జగన్ మాట్లాడిన వీడియో ... లాజికల్ ప్రశ్నలు వేసిన మెగా బ్రదర్

జనసేన పార్టీ తరపు నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నర్సాపూర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ బరిలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు . అందులో భాగంగా నాగబాబు జగన్ పై కొన్ని లాజిక్లతో కూడిన విమర్శలు చేశారు. తాజాగా జగన్ కు సంబంధించిన ఒక వీడియో బయట పడిందని ఆ వీడియోలో జగన్ తన పార్టీ నేతలతో ఇప్పుడు మీరు ఎంతైతే ఖర్చు పెట్టి పోతుందనుకుంటున్నారో రేపు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి నాలుగింతలు సంపాదించేలా నేను చేస్తానని ముందు గానే హామీ ఇచ్చేసినట్టు ఉందని తెలిసిందన్నారు . ఈ నేపధ్యంలో ఎంత అవినీతి చేస్తే నాలుగింతలు సంపాదిస్తారో అంటూ మెగా బ్రదర్ నాగబాబు సెటైర్లు వేశారు .

అవినీతి చెయ్యకుంటే నాలుగింతలు ఎలా సంపాదిస్తారని ప్రశ్న

అవినీతి చెయ్యకుంటే నాలుగింతలు ఎలా సంపాదిస్తారని ప్రశ్న

నాగబాబు లాజిక్ ప్రకారం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి తన నియోజకవర్గానికి సంబంధించి మినిమం 30 కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది. జగన్ కూడా ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టే అభ్యర్థులకే సీట్లు కేటాయించారని తెలిసింది. అంటే ఈ 30 కోట్లు ఖర్చు పెట్టిన అభ్యర్థి రేపు గెలిస్తే దానికి నాలుగింతలు 120 కోట్లు సంపాదించేలా చేస్తానని జగన్ చెప్తున్నారు .ఎలాంటి అవినీతి చెయ్యకుండా ఇంత డబ్బులు ఎలా సంపాదిస్తారో లాజిక్ నాకు అర్ధం కావటం లేదు అంటూ లాజికల్ గా సెటైర్లు వేస్తున్నారు.

జగన్ ఏపీని బిర్యానీలా తినేస్తాడా అంటూ సెటైర్లు

జగన్ ఏపీని బిర్యానీలా తినేస్తాడా అంటూ సెటైర్లు

అంతే కాకుండా జగన్ అదే వీడియోలో తాము గెలిచిన తర్వాత అప్పుడు మన బిర్యానీ మన ప్లేట్ లోనే పెట్టుకొని తినొచ్చు అని అంటున్నారని అంటే ఆంధ్రప్రదేశ్ ను బిర్యానిలా తినేయడానికి జగన్ రెడీగా ఉన్నారని నాగబాబు వ్యాఖ్యానించారు. గతంలో చాలా సైలెంట్ గా తనపని తానూ చేసుకుపోయే మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సెటైర్లు , పంచ్ లతో జబర్దస్త్ రాజకీయాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+