• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జబర్దస్త్ షో మూడ్ నుంచి బయటపడని నాగబాబు !? ఎన్నికల ప్రచారంలో కూడా బూతులు !

|

ఏపీలో ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన మెగా బ్రదర్ నాగబాబు సైతం ప్రత్యర్ధులపై మాటల దాడి చేస్తున్నారు. రాజకీయాల్లోకి రీసెంట్ గా వచ్చినా సీనియర్ లాగా విమర్శల వర్షం కురిపిస్తున్నాడు. జనసేన తరపున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పవన్ సోదరుడు నాగబాబు తనను నాన్ లోకల్ అంటూ వైసీపీ ఎంపీ అభ్యర్ధి రఘరామ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలపై తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి పోశారు .

నాన్న కోసం నిహారిక ..నాన్నకు ఓటెయ్యండి , బాబాయి పార్టీని గెలిపించండని విజ్ఞప్తి

నాన్ లోకల్ అన్న వ్యాఖ్యలపై మండిపడిన నాగబాబు .. రాస్కెల్స్ అంటూ ప్రతిదాడి

నాన్ లోకల్ అన్న వ్యాఖ్యలపై మండిపడిన నాగబాబు .. రాస్కెల్స్ అంటూ ప్రతిదాడి

ఎవడా రాస్కెల్ నేను నాన్ లోకల్ అంది అంటూ భగ్గుమన్నారు .తాజాగా ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అసలైన స్థానికుడ్ని నేనే అని.. ఆ వెధవలకు ఏం తెలుసు నా గురించి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నాగబాబు ఆ రాస్కెల్స్ కంటే నేను బెటర్ అంటూ ఘాటుగా స్పందించారు . నన్ను నాన్ లోకల్ అన్న సన్నాసి ఎవడు. నన్ను విమర్శించే వాళ్లకు ఏం తెలుసు వాళ్ల బొంద. వాళ్లంత యూజ్ లెస్ ఫెలోస్.. వాళ్ళంత పనికిమానిన సన్నాసులు ఎవరూ లేరు అంటూ తిట్టిపోశారు .

తన మూలాలు వెస్ట్ గోదావరిలో ఉన్నాయన్న నాగబాబు

తన మూలాలు వెస్ట్ గోదావరిలో ఉన్నాయన్న నాగబాబు

ఇక తాను పుట్టింది మొగల్తూరులో. నరసాపురం తాలూకా హైస్కూల్‌లో చదువుకుని వైఎన్ కాలేజ్ ఇంటర్ పూర్తి చేశానని చెప్పిన నాగబాబు తాను వెస్ట్ గోదావరి మొత్తం తిరిగిన వాడినని చెప్పారు. అంతేకాదు తన భార్యది కూడా వెస్ట్ గోదావరేనని , ఇక నాగబాబు నాన్నగారిది పెనుగొండ అని తమ కుటుంబానికి ఇక్కడ మూలాలు ఉన్నాయి అన్నారు . ఈ సన్నాసులకు ఏం ఉన్నాయి. సొల్లు మాటలు, వెధవ కబుర్లు చెప్పడానికి తప్పితే వీళ్లు ఎందుకూ పనికిరారు అంటూ ప్రత్యర్ధి పై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు మెగా బ్రదర్ .

రఘురామరాజు లోకలా.. ఈ రాస్కెల్స్ కంటే నేను బెటర్ అన్న నాగబాబు

రఘురామరాజు లోకలా.. ఈ రాస్కెల్స్ కంటే నేను బెటర్ అన్న నాగబాబు

ఇక అక్కడితో ఆగక నాగబాబు మరో అడుగు ముందుకు వేసి అందరూ తనను అంటున్నారు కానీ తనపై పోటీ చేస్తున్న రఘురామరాజు లోకలా? అతని బాగోతం అందరికీ తెలుసు అంటూ విరుచుకుపడ్డారు. పండుగలు వచ్చినప్పుడు బెట్టింగ్ బంగారు రాజులు వాళ్ళని , పైరవీలు చేసుకునే వాళ్లకు సిగ్గుందా? అని ప్రశ్నించిన నాగబాబు రోజుకో పార్టీ మారతాడు రఘరామ రాజు అంటూ ఎద్దేవా చేశారు . వీళ్లు లోకలా? వీళ్లను గెలిపించాలా? అని ఘాటుగా స్పందించైనా మెగా బ్రదర్ నేను అసలైన లోకల్ అంటే. ప్రజలకు ప్రేమతో సేవ చేసేవాడే నిజమైన లోకల్. ఈ రాస్కెల్స్ కంటే నేను చాలా బెటర్' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. రాస్కెల్స్, వెధవలు అంటూ ప్రత్యర్ధులపై నాన్ లోకల్ అన్నందుకు ప్రతి దాడి చేసి సెన్సేషన్ సృష్టించారు .

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mega Brother Naga Babu, who has been contested from narasapuram lok sabha segment from janasena party has targeted the opposition candidates who has contested in narasapuram. he fired on the remarks made by Raghu rama Krishnam Raju, the candidate of the YCP. He made Strong comments who are the Rascals and useless fellows talking about me as non local . i'm better than the rascals Nagababu said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more