RK Roja: పోలింగ్ వేళ బాంబుపేల్చిన ఆర్కే రోజా-నగరిలో తన ఓటమికి ప్లాన్..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే మధ్యాహ్నం 3 గంటల కల్లా పలు చోట్ల 60 శాతం పైగా ఓట్లు పోలయ్యాయి. దీంతో అధికార వైసీపీ నేతలు కూడా పోలింగ్ శాతాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ నగరిలో హ్యాట్రిక్ పై కన్నేసిన మంత్రి ఆర్కే రోజా మాత్రం వైసీపీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ సొంత పార్టీలో ప్రత్యర్థులపై రోజా మరోసారి విమర్శలు గుప్పించారు.

నగరిలో తన ఓటమి కోసం వైసీపీలో కొందరు నేతలు పనిచేస్తున్నారని ఆర్కే రోజా బాంబు పేల్చారు. ఇన్నాళ్లూ పార్టీలో తన ప్రత్యర్థులుగా ఉన్న వారంతా ఇప్పుడు ఎన్నికల వేళ తన ఓటమికి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా సీఎం జగన్ నుంచి నామినేటెడ్ పదవులు తీసుకున్న వైసీపీ నేత కేజే కుమార్ వంటి వారు తన ఓటమికి ప్రయత్నిస్తున్నారని రోజా ఆరోపించారు. ఇంకా చెప్పాలంటే టీడీపీ నేతల కంటే వీరే తన ఓటమికి ఎక్కువగా కష్టపడుతున్నారన్నారు.

nagari ysrcp candidate rk roja sensational allegations on own party rivals

వైసీపీలో తన ప్రత్యర్థుల వ్యవహారం దురదృష్టకరమని ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. ఇప్పటికే నగరిలో రోజాకు ప్రత్యర్థులు పెరిగారని, ఈ ఎన్నికల్లో ఆమె గెలుపు కష్టమేనని నివేదికలు వెలువడుతున్న నేపథ్యంలో స్వయంగా ఆమే తన ప్రత్యర్థులు ఏం చేస్తున్నారో చెప్పేయడం విశేషం. ఇప్పటికే జిల్లాల్లో ఆమె మంత్రి కావడం జీర్ణించుకోలేక కొందరు, పాత గొడవలతో మరికొందరు, మంత్రి అయ్యాక ఆమె వ్యవహరశైలి నచ్చక ఇంకొందరు దూరమయ్యారు. వీరే తన ఓటమికి ప్రయత్నిస్తున్నారని రోజా ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+