Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Nagari Assembly Election 2024 Results LIVE: నగిరిలో నాట్యాం చేసేది ఎవరు ?

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గర పడటంతో మరోసారి నగరి పేరు తెరమీదకు వచ్చింది. నగిరి అంటే రోజా కదా అని అందరూ టక్కున చెబుతారు. సినీనటిగా తన గ్లామర్‌కు తోడు, వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా ప్రత్యర్ధులపై పదునైన విమర్శలు చేస్తూ రోజా ఇంతకాలం దూసుకుపోయారు. అయితే పోలింగ్ పూర్తి అయిన తరువాత మంత్రి రోజా సైలెంట్ అయిపోవడం కూడా తీవ్రచర్చకు దారితీసింది.

నగరిలో వైసీపీ జైత్రయాత్రను కొనసాగించాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. అయితే రోజాకు స్థానిక వైసీపీ నేతల నుంచి అడ్డంకులు ఎదురైనాయి. దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భాను ప్రకాష్‌ను టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించిన తరువాత నగిరి నియోజక వర్గంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఇదే సమయంలో రోజాకు చెక్ పెట్టడానికి చంద్రబాబు నాయుడు కూడా చక్రం తిప్పారు. తరువాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్ అయ్యింది.

AP election results Nagiri Assembly Election 2024 Results voting counting live updates news in telugu

2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా పుత్తూరు నియోజకవర్గం రద్దు కావడంతో వడమాల, పుత్తూరు మండలాలు నగరి పరిధిలోకి వచ్చాయి. పుత్తూరులో ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన గాలి ముద్దుకృష్ణమనాయుడు నగరిలో ఆరో విజయం అందుకున్నారు. అలాగే నగరిలో కాంగ్రెస్ నేత రెడ్డివారి చెంగారెడ్డి ఐదు సార్లు గెలిచారు. 2014లో సినీనటి రోజా వైసీపీ అభ్యర్ధిగా తొలుత విజయం సాధించారు.

ఆ తర్వాత నగరిని రోజా ఆమె తన అడ్డాగా చేసుకున్నారు. 2019 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రోజాకు 80,333 ఓట్లు, టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాష్‌కు 77,625 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా రోజా కేవలం 1,352 ఓట్ల తేడాతో వరుసగా రెండోసారి విజయం అందుకుని ఎమ్మెల్యే కావడంతో వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. మంత్రి అయిన తర్వాత రోజా తీరులో మార్పులు రావడంతో సొంత పార్టీ నాయకులే ఆమెకు దూరం అయ్యారు.

2024 ఎన్నికల్లో నగరిలో వైసీపీ జైత్రయాత్రను కొనసాగించాలని వైఎస్ జగన్ భావించి మరోసారి రోజాకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడానికి సిద్దం అయ్యారు. అయితే రోజాకు స్థానిక వైసీపీ నేతల నుంచి అడ్డంకులు ఎదురుకావడంతో మొదట రోజా ఏమాత్రం పట్టించుకోలేదు. రోజాకు టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని కేజే కుమార్, కేజే శాంతి, రెడ్డివారి చక్రపాణి రెడ్డి తదితరులు రోజాపై రగిలిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే రోజాకు వైసీపీ టిక్కెట్ ఇచ్చారు.

గత10 ఏళ్లుగా రోజా మీద పోరాటం చేస్తున్న గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భాను ప్రకాష్‌ను టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించడంతో నగిరి రాజకీయాలు మారిపోయాయి. ప్రతి సర్వేలో కూడా రోజా ఓడిపోతారు అనే అందరూ చెప్పారు. అయితే తాను మూడోసారి ఎమ్మెల్యే అయ్యి జగనన్నకు బహుమానం ఇస్తానని రోజా మాత్రం ధీమాగా ఉన్నారు. అయితే పోలింగ్ ముందు రోజా వేరు, పోలింగ్ తరువాత రోజా వేరు అని నగిరి ప్రజలు అంటున్నారు. జూన్ నాలుగో తేదీన చిత్తూరు జిల్లాలో మొదట నగిరి ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+