పరిస్థితి బాగోలేదు: గవర్నర్‌తో చంద్రబాబు(పిక్చర్స్)
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించడంతోపాటు, తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు. దాదాపు గంట సేవు ఇద్దరు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ప్రధానంగా రాజధాని అంశాన్ని గవర్నర్‌కు చంద్రబాబు వివరించినట్లు తెలిసింది.
రాజధాని నిర్మాణం, డిజైన్ అంశాలు, తాత్కాలిక రాజధానిపై ఆయన వివరిస్తూ భూసేకరణకు తీసుకుంటున్న చర్యలను విశదీకరించినట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ సమయంలో తొలిసారి వేస్ అండ్ మీన్స్‌కు వెళ్లడం, ఖజానా లోటు రోజురోజుకూ పెరుగుతుండడంపై వివరించారు.
ఈ సందర్భంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎంతో అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ నిధులను, ఇతర అంశాల్లో కేంద్రం ఇచ్చిన హామీలు, వాటి పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వివరించినట్లు తెలిసింది. గవర్నర్ తరఫున కూడా కేంద్రానికి నివేదిక ఇస్తే బాగుంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ఇది ఇలా ఉండగా, రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించేందుకు ఇటీవల దావోస్‌లో తన పర్యటన, ఫలితాలపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. అనేకమంది అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక వేత్తలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉత్సాహం చూపించారని వివరించారు. కాగా, రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన ఎంసెట్‌పై కూడా చంద్రబాబు వివరించినట్లు తెలిసింది

చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించడంతోపాటు, తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు. దాదాపు గంట సేవు ఇద్దరు వివిధ అంశాలపై చర్చించుకున్నారు.

చంద్రబాబు
ప్రధానంగా రాజధాని అంశాన్ని గవర్నర్‌కు చంద్రబాబు వివరించినట్లు తెలిసింది. రాజధాని నిర్మాణం, డిజైన్ అంశాలు, తాత్కాలిక రాజధానిపై ఆయన వివరిస్తూ భూసేకరణకు తీసుకుంటున్న చర్యలను విశదీకరించినట్లు సమాచారం.

చంద్రబాబు
డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ 2015 నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించిన చంద్రబాబునాయుడు.

చంద్రబాబు
‘జల్లేమూడి అమ్మా-బొమ్మల కథ' అనే మేగజైన్‌ను ఆవిష్కరిస్తున్న సిఎం చంద్రబాబునాయుడు.

చంద్రబాబు
తమ వివాహానికి మద్దతుగా నిలిచినందుకు వరంగల్ జిల్లాకు చెందిన ఓ జంట సిఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబు
చంద్రబాబును కలిసిన ది నేచర్ కన్జర్వేన్సీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ విలియ్ గిన్.

చంద్రబాబు
లేక్ గెస్ట్ హౌజ్‌లో సిఎం చంద్రబాబును కలిసిన చైనాకు చెందిన ప్రతినిధులు.

చంద్రబాబు
సిఎం చంద్రబాబును కలిసిన ఏపిఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ నాయకులు.

చంద్రబాబు
తమకు పింఛన్లు అందిస్తున్నందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్న వికలాంగులు.

చంద్రబాబు
సిఎం చంద్రబాబును కలిసిన ఏపిఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ నాయకులు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications