ప్రేమ: దాడిలో గాయపడ్డ అరుణ మృతి, రేవతి కూడా

వివాహితుడైన సైదులు అరుణను ప్రేమ పేరుతో మోసగించి పెళ్లికి నిరాకరించి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడింది. ఐదు రోజులపాటు చికిత్సనంతరం ఆమె మృతి చెందగా తల్లిదండ్రులు, బంధువులతోపాటు చదువుతున్న నిట్స్ కళాశాల విద్యార్థులను తీవ్ర విషాదంలో మునిగారు. కాగా ఇప్పటికే పోలీసులు అరుణపై దాడి చేసిన సైదులును అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో..
తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఓ యువతి మృతి చెందింది. జిల్లాలోని పిఠాపురంకు చెందిన రేవతిని నవీన్ అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో వేధించేవాడు. ఆమెకు మరొకరితో వివాహం కుదిరింది. ఆదివారం పెళ్లి కావాల్సి ఉండె. రేవతికి పెళ్లి కుదిరిందని తెలుసుకున్న నవీన్ ఆమెను వేధించాడు. ఈ నెల 11వ తేదీన బాలికపై కిరోసిన్ పోసీ నిప్పంటించాడు. బాలిక తీవ్ర గాయాలతోకాకినాడ జిజిహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
రంగారెడ్డి జిల్లాలో బాలికపై అత్యాచారం హత్య
రంగారెడ్డి జిల్లాలో ఏడో తరగతి చదువుతున్న ఓ బాలిక పైన గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, హత్య చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో జరిగింది.












Click it and Unblock the Notifications