VeerasimhaReddy : జగన్ టార్గెట్ గా రెచ్చిపోయిన బాలయ్య- వీరసింహారెడ్డిలో పంచ్ ల వెనుక ?

ఏపీలో ఎన్నికల ఏడాదిలోకి సమీపించిన తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య వార్ ముదురుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీకీ, విపక్ష టీడీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్దితులున్నాయి. ఈ నేపథ్యంలో ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్ధుల్ని టార్గెట్ చేసేందుకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా తన లేటెస్ట్ చిత్రం వీర సింహారెడ్డిలో టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ సీఎం వైఎస్ జగన్ పై పరోక్షంగా పంచ్ డైలాగులు వేశారు. నిన్న విడుదల చేసిన ట్రైలర్ లో బాలయ్య డైలాగులు చూస్తే ఈ సినిమా మొత్తం మీద వైసీపీ సర్కార్ ను ఏ స్ధాయిలో టార్గెట్ చేసి ఉంటారన్న దానిపై చర్చ జరుగుతోంది.

బాలయ్య వీరసింహారెడ్డి మూవీ

బాలయ్య వీరసింహారెడ్డి మూవీ


ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ విడుదలవుతోంది. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ ఎప్పటిలాగా డైలాగులతో విరుచుకుపడ్డారు. అలాగే తన రాజకీయ ప్రత్యర్ధుల్ని కూడా టార్గెట్ చేశారు. అవసరం ఉందా లేదా అన్న దానితో సంబంధం లేకుండా భారీ పంచ్ డైలాగుల్ని విసిరారు. నిన్న ఒంగోలులో జరిగిన మూవీ ప్రీ ఫంక్షన్ లో విడుదల చేసిన ట్రైలర్ లో బాలయ్య డైలాగ్స్ వింటే ఏపీలో సీఎం జగన్ ను ఏ స్ధాయిలో టార్గెట్ చేశారో ఇట్టే అర్ధమవుతుంది.

ట్రైలర్ లో బాలయ్య రెండు డైలాగ్స్

ట్రైలర్ లో బాలయ్య రెండు డైలాగ్స్

వీరసింహారెడ్డి ట్రైలర్ లో నందమూరి హీరో బాలయ్య రెండు కీలకమైన డైలాగ్స్ వేశారు. సినిమాలో తన ప్రత్యర్ధిని ఉద్దేశించి వేసిన ఈ రెండు పంచ్ డైలాగ్స్ చూస్తే అవి కచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేత అయిన సీఎం జగన్ ను ఉద్దేశించి వేసిన డైలాగ్స్ లాగే కనిపిస్తున్నాయి. అదీ తాజాగా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఉద్దేశించి పరోక్షంగా ఓ డైలాగ్ వేశారు. ట్రైలర్ లోనే ఈ స్ధాయిలో డైలాగ్స్ ఉంటే రేపు సంక్రాంతికి విడుదలయ్యే సినిమా మొత్తం మీద ఇలాంటి డైలాగ్స్ మరెన్ని ఉంటాయో అన్న చర్చ జరుగుతోంది.

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై పంచ్ ?

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై పంచ్ ?

వైసీపీ సర్కార్ విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చి మాజీ సీఎం వైఎస్సార్ పేరు పెట్టింది. దీనిపై రాజకీయంగా పెను దుమారమే రేగింది. అయినా జగన్ ఇవేవీ పట్టించుకోలేదు. ఈ సందర్భంగా బాలయ్య కూడా అప్పట్లో ఓ సంచలన ట్వీట్ పెట్టారు. దీనిపైనా వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అదే అంశాన్ని మరోసారి కెలుకుతూ బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలో పంచ్ డైలాగ్ వేశారు. "సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ, చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు" అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ చూస్తే ఇది కచ్చితంగా ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పును ఉద్దేశించి వేసిందేనని పిల్లలకు సైతం అర్ధమవుతోంది.

జగన్ సీఎం పదవిపైనా బాలయ్య పంచ్ ?

జగన్ సీఎం పదవిపైనా బాలయ్య పంచ్ ?

అలాగే ఏపీలో తొలిసారి సీఎం పదవిలోకి వచ్చిన వైఎస్ జగన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలపై టీడీపీ ఆగ్రహంగా ఉంది. అయినా జగన్ మాత్రం సీఎంగా తనకు నచ్చిన నిర్ణయాలతోనే ముందుకెళ్తున్నారు. ప్రజలు తనకు అధికారం ఇచ్చారు కాబట్టి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉందంటున్నారు. దీనిపై విమర్శలు వస్తున్నా లెక్కచేయడం లేదు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తన వీరసింహారెడ్డి సినిమాలో పదవి చూసకుని నీకు పొగరేమో, కానీ బై బర్త్ నా డీఎన్ఏకే పొగరెక్కువ " అంటూ తన తండ్రి కూడా సీఎంగా పనిచేసిన విషయాన్ని బాలయ్య గుర్తు చేస్తున్నారు. దీనిపైనా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+