బాలయ్యను ప్రేమగా పలకరించిన జూనియర్ ఎన్టీఆర్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి హీరోల క్రేజ్, వారి అభిమానుల ఫాలోయింగ్ అంతా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీరిని అభిమానించేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. వరుసగా సినిమాలు ఫ్లాపవుతున్న తరుణంలో అఖండ లాంటి భారీ హిట్ కొట్టిన బాలయ్య ఆ తర్వాత చేసిన టీవీషో అన్ స్టాపబుల్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ షోవల్ల ఇప్పటి తరంవారు కూడా బాలకృష్ణకు అభిమానులుగా మారిపోయారు. ఇతర భాషల్లో కూడా నందమూరి కథానాయకులు సత్తా చాటుకుతున్నారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని కుమారుడు హర్ష వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ హీరోగా అవతరించారు జూనియర్ ఎన్టీఆర్. కొద్దికాలం నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సత్సంబంధాలు లేవంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుక ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది.

బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వీరిద్దరి మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని ఆప్యాయంగా పలకరించుకున్న తీరు చెబుతోందంటున్నారు. వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూడటానికి రెండు కళ్లు చాలడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలయ్య, తారక్ కాంబినేషన్ లో సినిమా వస్తే ట్రెండ్ సెట్టర్ అవుతుందని, అభిమానులకు పండగేననే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. భవిష్యత్తులో ఏ నిర్మాతైనా, దర్శకుడైనా ఈ ప్రయత్నం చేస్తారేమో చూడాలి మరి.












Click it and Unblock the Notifications