విషమంగా తారకరత్న ఆరోగ్యం.. ఆస్పత్రికి చేరుకున్న బాలకృష్ణ
22 రోజులుగా తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే.
సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గత 22 రోజులుగా ఆయన బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.. వైద్యం కోసం ఇప్పటికే విదేశీ వైద్యుల బృందం రంగంలోకి దిగింది. ఇప్పటికే బాలకృష్ణ సహా కుటుంబసభ్యులు మొత్తం హాస్పిటల్ కు చేరుకున్నారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు సాయంత్రం 4.30 గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. నారా లోకేష్ పాదయాత్రలో కళ్ళు తిరిగి పడిపోయిన తారకరత్నను కుప్పం హాస్పిటల్ లో చేర్పించగా అతనికి తీవ్ర గుండెపోటు వచ్చినట్లు వైద్యులు ఖరారు చేశారు. వెంటనే తారకరత్నను మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో అడ్మిట్ చేసి వైద్యం అందిస్తున్నారు. ఆయన కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని కోరుకుంటున్నారు.

కుప్పం నుంచి నారాయణ హృదయాలయకు తరలించిన తర్వాత తారకరత్న ఆరోగ్యం కుదుటపడినట్లు వైద్యులు తెలిపారు. తర్వాత మూడు రోజులకు పరిస్థితి విషమంగా ఉందంటూ బుల్లెటిన్ విడుదల చేశారు. తారకరత్న కుటుంబ సభ్యులతోపాటు నందమూరి కుటుంబానికి చెందినవారంతా ఆస్పత్రికి చేరుకున్నారు. విదేశాలకు తరలించాలనుకున్నప్పటికీ తారకరత్నను ఇప్పుడున్న పరిస్థితిలో తరలించడం కష్టమని, అన్ని సౌకర్యాలు ఇక్కడే ఉన్నందును విదేశాల నుంచి వైద్యులను రప్పించాలని కుటుంబ సభ్యలు నిర్ణయించుకున్నారు. ఈమేరకు విదేశాల నుంచి వచ్చిన వైద్యులతో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి దగ్గర అన్ని వ్యవహారాలను బాలకృష్ణ దగ్గురండి చూసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications