జనసేన పార్టీలో కొనసాగడంపై స్పష్టత ఇచ్చిన నాదేండ్ల మనోహర్

జనసేన పార్టీ కీలక నేత , గుంటురు జిల్లాకు చెందిన నాదేండ్ల మనోహర్ పార్టీ వీడుతారని వస్తున్న ప్రచారంలో నిజం లేదని పార్టీ నేతలు స్పష్టం చేశారు. కాగా ఆయన విదేశాల్లో ఉండడం వల్లే సమీక్ష సమావేశాలకు హజరుకాలేక పోయారని తెలిపారు. కాగ అదే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు జనసేనకు రాజీనామ చేసిన విషయం తెలిసిందే. దీంతో నాదేండ్ల మనోహర్ కూడ పార్టీని వీడుతారని ప్రచారం జరిగింది.

కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే పార్టీలో కీలక నేతగా ఉన్న నాదేండ్ల మనోహర్ హజరు కాలేదు. దీంతో మనోహర్ అమేరికా పర్యటనలో ఉన్నందువల్లే సమీక్ష సమావేశాలకు హజరుకాలేకపోయారని తెలిపారు. ఈనేపథ్యంలోనే ఆయన పార్టీని విడే ప్రసక్తి లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.కాగా నాదేండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి నియోజక వర్గం నుండి పోటి చేసి ఓడి పోయారు.

 Nandendla Manohar is not leaving jana sena party.

ఇక గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాన్ పార్టీ ఓటమికి గల కారణాలపై వివిధ జిల్లాల నేతలతో అమరావతిలో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో కేవలం ఒక్క సీటును గెలుచుకోవడంతోపాటు పవన్ కళ్యాన్ పోటి చేసిన రెండు స్థానాల్లో కూడ ఓటమీ పాలు కావడంతో పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు.దీంతో పార్టీ ఓటమీపై పవన్ కళ్యాణ్ పై సీరియస్‌గా దృష్టి సారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+