వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్ మీద షాక్: అంత మాటా? బాబుకు చిక్కులు తెచ్చిన లోకేష్, పోసాని ఆగ్రహం వెనుక

ఇప్పటికే నంది అవార్డుల ప్రకటనతో తలపట్టుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరో కొత్త తలనొప్పి తీసుకు వచ్చారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఇప్పటికే నంది అవార్డుల ప్రకటనతో తలపట్టుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరో కొత్త తలనొప్పి తీసుకు వచ్చారు. ఇటీవల విపక్షాలకు చంద్రబాబు ప్రభుత్వంపై వరుసగా అస్త్రాలు దొరుకుతున్నాయి.

Recommended Video

Nandi Awards controversy : పోసానికి లోకేష్ కౌంటర్, కులంతో బాలకృష్ణ కి ఝలక్

బోటు ప్రమాదం విషయంలో అధికారుల తప్పిదం ఉందనే విమర్శలు వచ్చాయి. సీఎం చంద్రబాబు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఆ తర్వాత నంది అవార్డులు తీవ్ర కలకలం రేపాయి. ఓ కమ్యూనిటికీ, ఏపీ ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వారికి అవార్డులు వచ్చాయనే ఆరోపణలు వచ్చాయి.

నంది అవార్డ్: జూ ఎన్టీఆర్‌ను పక్కనపెట్టిన లోకేష్! కావాలనే చేశారా?నంది అవార్డ్: జూ ఎన్టీఆర్‌ను పక్కనపెట్టిన లోకేష్! కావాలనే చేశారా?

తప్పులో కాలేసిన నారా లోకేష్

తప్పులో కాలేసిన నారా లోకేష్

ఈ ఆరోపణలను ప్రభుత్వం కొట్టి పారేస్తోంది. ఓ వైపు నంది అవార్డుల వివాదం కొనసాగుతుండగా లోకేష్ తన వ్యాఖ్యలతో కొత్త చిక్కులు తెచ్చారని అంటున్నారు. అవార్డుల విషయంలోనే ప్రభుత్వం తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దానిని సమర్థించుకునే క్రమంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు దారి తప్పాయని అంటున్నారు.

అది కూడా తెలియదా: పోసానికి లోకేష్ కౌంటర్, బాలకృష్ణ-కులంతో టీడీపీకి ఝలక్అది కూడా తెలియదా: పోసానికి లోకేష్ కౌంటర్, బాలకృష్ణ-కులంతో టీడీపీకి ఝలక్

లోకేష్ ఏమన్నారంటే

లోకేష్ ఏమన్నారంటే

లోకేష్ వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. ఏపీలో స్థానికత లేని వారికి తమకు విమర్శించే అర్హత లేదని, ఏపీలో ఆధార్, ఓటర్ కార్డు లేని వాళ్లు హైదరాబాదులో కూర్చొని విమర్శలు చేస్తున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటిగా ఉండాలనుకున్నప్పుడు, కొన్నేళ్ల క్రితమే విభజన జరిగిన ఇలాంటి సమయంలో ఏపీలో ఆధార్, ఓటరు కార్డు లేనివాళ్లు మాట్లాడుతారా అని లోకేష్ వ్యాఖ్యానించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.

బాలకృష్ణ వల్లేనా? బాబుకు తలనొప్పి: నంది అవార్డులు ఎవరికి, ఎలా సంబంధం?బాలకృష్ణ వల్లేనా? బాబుకు తలనొప్పి: నంది అవార్డులు ఎవరికి, ఎలా సంబంధం?

విమర్శలకు సమాధానం తప్పులేదు కానీ, ఎన్ఆర్ఏ

విమర్శలకు సమాధానం తప్పులేదు కానీ, ఎన్ఆర్ఏ

నంది అవార్డులపై ఇద్దరు ముగ్గురే ఆరోపణలు చేస్తున్నారని, అసలు అవార్డులే ఇవ్వని ప్రభుత్వాలపై వారు మాట్లాడలేదని, జ్యూరీ సభ్యుల నిర్ణయం అవార్డులు ప్రకటించామని కూడా లోకేష్ చెప్పారు. విమర్శలపై ఇలా సమాధానంలో తప్పులేదు. కానీ ఏపీలో లేనివారని, వాళ్లంతా నాన్ రెసిడెంట్ ఆంధ్రా, ఎన్ఆర్ఏలు అని వ్యాఖ్యానించడాన్ని మాత్రం తప్పుబడుతున్నారు.

ఇవేం వ్యాఖ్యలు

ఇవేం వ్యాఖ్యలు

నారా లోకేష్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఏపీలో ఉన్న వారు తీసే సినిమాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వారు తీసే సినిమాలకు తెలంగాణ ప్రభుత్వమే అవార్డులు ఇవ్వాలనే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికావని అంటున్నారు.

పోసాని ఆగ్రహం వెనుక ఇదే

పోసాని ఆగ్రహం వెనుక ఇదే

నారా లోకేష్‌పై పోసాని కృష్ణ మురళీ అగ్రహం వ్యక్తం చేయడానికి అదే కారణంగా చెప్పవచ్చు. మేం ఎన్నారైలం అయితే లోకేష్ ఏమిటని, లోకేష్‌కు ఉన్న మనస్తత్వం తెలంగాణ ప్రజలకు ఉంటే మమ్మల్ని తరిమి కొట్టేవారని, లోకేష్ మంత్రి కావడం ఖర్మ అని, తెలంగాణలో పన్నులు కడితే ఏపీ గురించి మాట్లాడవద్దా, మీకు తెలంగాణలో వ్యాపారాలు లేవా అని నిలదీశారు. అంతేకాదు, చంద్రబాబు చెప్పినట్లు ఐవీఆర్ఎస్ ద్వారా నంది ఇస్తే తాను తీసుకుంటానని చెప్పారు.

చంద్రబాబు అలా, లోకేష్ ఇలా

చంద్రబాబు అలా, లోకేష్ ఇలా

పోసానితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా నారా లోకేష్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. అవగాహన లేకుండా మాట్లాడి మీ పరువు, రాష్ట్రం పరువు తీయవద్దని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. చంద్రబాబు మాత్రం హుందాగా వ్యవహరించారని చెప్పారు. మొన్నటి వరకు మీ ఆధార్ కార్డులు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. నంది అవార్డులు రాని వారు రచ్చ చేయడం సహజమేనని, కానీ దానిని మరింత వివాదం చేయవద్దని నటుడు కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు సూచించారు.

English summary
Andhra Pradesh's Minister for Information Technology, Panchayat Raj and Rural Development Nara Lokesh responded to the criticism of the Nandi Award results on Monday, and found fault with the critics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X