నన్నపనేని కారు ప్రమాదం: గాయపడిన యువకుడు, స్పృహ తప్పిన నేత
తెలుగుదేశం పార్టీ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురై ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన పాత గుంటూరు, తక్కెళ్లపాడు
గుంటూరు: తెలుగుదేశం పార్టీ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురై ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన పాత గుంటూరు, తక్కెళ్లపాడు మధ్య శుక్రవారం జరిగింది.
నన్నపనేని రాజకుమారి ప్రయాణిస్తున్న కారు ఢీకొని పాతగుంటూరుకు చెందిన అన్నం గరటయ్య అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తెనాలి నుంచి నందివెలుగు మీదుగా గుంటూరు వస్తున్న ఆమె వాహనం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎదురుగా వస్తున్న గరటయ్య వాహనాన్ని ఢీకొంది.

ఘటన జరిగిన ప్రదేశంలోనే గరటయ్యకు తీవ్ర రక్తస్రావం కావడంతో అది చూసిన నన్నపనేని లో బీపీతో స్పృహ కోల్పోయారు. వెంటనే ఆమె గన్‌మన్‌లు గరటయ్యను జీజీహెచ్‌లో చేర్పించారు. తలభాగంలో తీవ్ర గాయం కావడంతో వైద్యులు ప్రథమ చికిత్స అందించి అనంతరం ఐసీయూలో చేర్చారు. ప్రాణాపాయ స్థితి ఉండకపోవచ్చని వైద్యులు తెలిపారు.
స్పృహ కోల్పోయిన నన్నపనేనిని మరో ఆసుపత్రికి తరలించారు. విషయంలో తెలుసుకున్న తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ తూర్పు ఇన్‌ఛార్జ్ మద్దాళి గిరి గాయపడిన యువకుడి తండ్రిని పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులకు సూచించారు.












Click it and Unblock the Notifications