భువనేశ్వరి నా జీవితానికి వెలుగు: సీఎం చంద్రబాబు ఎమోషనల్

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. ఒకప్పుడు భువనేశ్వరి అంటే జనాలకు పెద్దగా తెలీని మనిషి. కేవలం ఎన్టీఆర్ కుమార్తెగా, చంద్రబాబు సతీమణిగా, హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆమెకు గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడు భువనేశ్వరి అంటే అందరి మనసులో మంచి స్థానం దక్కించుకున్న మహిళ. ఒక స్ఫూర్తిదాయకమైన మహిళ.

నారా భువనేశ్వరి పుట్టినరోజు
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణిగానే కాదు, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో, రాజధాని అమరావతి కోసం సాగిన పోరాటాల్లో ప్రజల పక్షాన తన గొంతుకను వినిపించి, వారి కోసం దీక్షలు చేసిన, వారి తరపున పోరాటం సాగించిన వీర వనితగా, కష్టకాలంలో చంద్రబాబుకు బాసటగా నిలిచిన ధీర చరితగా ఆమెకు ఏపీ రాజకీయాలలో మంచిస్థానం ఉంది. అటువంటి నారా భువనేశ్వరి నేడు పుట్టినరోజు.

nara bhuvaneswari birthday ap cm chandrababu emotional post on bhuvaneswari

భువనేశ్వరి పుట్టినరోజుకి చంద్రబాబు ఎమోషనల్ పోస్ట్
ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి ఎమోషనల్ ట్వీట్ చేశారు.ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన చంద్రబాబు భువనేశ్వరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ ప్రేమ, మీ బలం మా కుటుంబానికి పునాది లాంటిదని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

మా జీవితాలలో వెలుగు : చంద్రబాబు ట్వీట్
జీవితంలోని ఎత్తు పల్లాలలో మీరు నాకు తోడుగా ఉన్నారని, మీరు నా జీవిత భాగస్వామి కావడం నా అదృష్టమని చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు. అర్ధాంగి భువనేశ్వరితో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. మీరు మా జీవితాలలో వెలుగు. మీ దయ, ప్రజల పట్ల మీ శ్రద్ధ, వ్యాపారంలో, దాతృత్వంలో, మీ నాయకత్వం అందరికీ స్ఫూర్తిని ఇస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.

చంద్రబాబు కోసం, ప్రజల కోసం భువనేశ్వరి ప్రయత్నం
మీలో ఉన్న గొప్పలక్షణాలు ఎన్నో నన్ను ఆకర్షిస్తాయని పేర్కొన్న చంద్రబాబు, మీ పుట్టినరోజు వేడుకను సంతోషంగా జరుపుకుందాం అంటూ ట్వీట్ చేశారు. నిజంగానే భువనేశ్వరి చంద్రబాబు జీవితానికి వెలుగని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలులో పెట్టినప్పుడు, పార్టీశ్రేణులకు ఆత్మస్థైర్యాన్ని నింపి, ముందుకు నడపడానికి, చంద్రబాబుకు బాసటగా నిలవడానికి, ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి భువనేశ్వరి చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు.

చంద్రబాబు విజయం వెనుక భువనేశ్వరి
నాటి వైసిపి ప్రభుత్వంతో పెద్ద ఎత్తున పోరాటం చేసిన నారా భువనేశ్వరి చూపించిన స్ఫూర్తి చంద్రబాబు కూడా ఊహించనిది. అందుకే చంద్రబాబు తన జీవితానికి భువనేశ్వరి వెలుగు చూపిందని ఘంటాపథంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈరోజు భువనేశ్వరి జన్మదినం సందర్భంగా బాబు కష్టకాలంలో చంద్రబాబుకు బాసటగా నిలిచిన భువనేశ్వరి త్యాగాలను గుర్తు చేసుకుని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని, చంద్రబాబు విజయం వెనుక భువనేశ్వరి ఉందని జేజేలు పలుకుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+