మా కుటుంబానికి ముప్పు ఉంది.. ఏపీ సీఎం సతీమణి సంచలన వ్యాఖ్యలు !!
తమ కుటుంబానికి ఇప్పటికి ముప్పు ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ కామెంట్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ ఫ్యామిలీకి ఇంకా బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పని చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
కాగా ప్రజలకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని భువనేశ్వరి భరోసా ఇచ్చారు. వైసీపీ పాలన గురించి మాట్లాడనని.. అది మర్చిపోలేని అంశమని పేర్కొన్నారు. అయితే వారి కుటుంబాన్ని ఎవరు బెదిరిస్తున్నారనే విషయాన్ని చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అలానే స్వచ్ఛ భారత్ అవార్డులు గెలుచుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను ఆమె అభినందించారు. దయాళ్ శ్రవణ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన వినికిడి పరికరాలను పంపిణీ చేశారు.

కాగా పర్యటనలో భాగంగా భువనేశ్వరి శాంతిపురంలోని తమ నివాసంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అనంతరం డీకే పల్లి వద్ద కృష్ణా జలాలకు ఆమె జల హారతి ఇచ్చారు. అంతకు ముందు గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణమ్మకు చీర సారె అందించడం తన పూర్వ జన్మ సుకృతమని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు కుప్పంలో నారా భువనేశ్వరి మొత్తంగా నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇప్పటికే రెండు రోజులు పూర్తి కాగా.. మరో రెండు రోజుల పాటు పర్యటన కొనసాగించనున్నారు. మిగిలిన రోజుల్లో కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆమె వెంట టీడీపీ మహిళా నేతలు, స్థానికులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మరి కీలక నేతలు భువనేశ్వరి వ్యాఖ్యల పట్ల ఎలా స్పందిస్తారో చూడాలి.
Had a meaningful interaction with the bright young minds of Dravidian University, Kuppam.
— Nara Bhuvaneswari (@ManagingTrustee) November 19, 2025
Their enthusiasm, discipline, and curiosity give me immense hope for the future.
Wishing each of them a journey filled with learning, growth, and purpose.#kuppam#AndhraPradesh pic.twitter.com/Xdwj3cz1xx
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications