వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోన్ ట్యాపింగ్‌ బట్టబయలైంది, ఇప్పుడేమంటారు? కెసిఆర్‌కు లోకేష్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో నిజం బట్టబయలైందని.. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇప్పుడేం సమాధానం చెబుతారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతనయుడు, టిడిపి యువ నేత నారా లోకేశ్‌ ప్రశ్నించారు. దీనిపై శనివారం ఆయన ట్విట్టర్‌లో స్పందించారు.

‘అసలు గుట్టు రట్టయింది. మేం ఇంతకాలం చెబుతున్నదే నిజమని టెలికం కంపెనీలూ తెలిపాయి. కెసిఆర్‌.. ఇప్పుడు మీ సమాధానం ఏమిటి? ' అని లోకేష్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

కెసిఆర్ అండ్ కో కంపెనీ చెప్పేదొకటి చేసేదొకటని విమర్శించారు. వాళ్ళు ఔనంటే కాదని, ఫోన్ ట్యాపింగ్ చేయలేదంటే చేశారని అర్థమని అన్నారు. ‘తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను బలి చేసే కెసిఆర్ స్వార్థ వైఖరి ఇంకా కొనసాగుతోంది' అని లోకేష్ దుయ్యబట్టారు.

కేసీఆర్‌ అండ్‌ కో చెప్పేదొకటి... చేసేదొకటి! వాళ్లు లేదు అంటే ఉందని అర్థం. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని అర్థం. తన వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజలను బలి చేయడం కెసిఆర్‌కు అలవాటు. గతంలో విద్యార్థులు... ఇప్పుడు అధికారులు' అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

English summary
Telugudesam leader Nara Lokesh asked through Twitter that Telangana CM K Chandrasekhar Rao on Phone Tapping issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X