Nara lokesh: సుబ్రహ్మణ్యం హత్య తర్వాత సజ్జలను కలిసిన ఎమ్మెల్సీ అనంతబాబు??
తన మాజీ డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసిన తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారా? అనంతబాబును ఈ కేసు నుంచి తప్పించేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సుబ్రమణ్యం కుటుంబానికి రూ.2 కోట్ల నగదు ఇస్తానని ప్రలోభ పెట్టారా? దళిత ప్రజలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారా? అనే ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఔనని సమాధానమిస్తున్నారు.
కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఈరోజు విజయవాడ కోర్టుకు హాజరైన లోకేష్ అనంతరం మీడియాతో మాట్లాడారు. డ్రైవర్‌ను హత్య చేసిన తర్వాత అనంతబాబు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారని ఆరోపించారు. పెళ్లిళ్లకు, పేరంటాలకు తిరుగుతుంటే పోలీసులకు మాత్రం కనపడటంలేదని ఎద్దేవా చేశారు. 24 గంటల్లో అనంతబాబును అరెస్ట్ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేశారు. కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నేతలను వేధించిన ప్రభుత్వం ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలపై కూడా కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు.

గంజాయి సరఫరాలో ఎమ్మెల్సీ అనంతబాబు ప్రధాన భూమిక పోషిస్తున్నారని, ఇదంతా తెలిసి సజ్జల ఎందుకు మాట్లాడంలేదని లోకేష్ ప్రశ్నించారు. జగన్‌లా తాను కోర్టుకు వాయిదాలు తీసుకోవడంలేదని, ప్రజలు రాళ్లతో కొట్టించుకునే పరిస్థితిని జగన్మోహన్‌రెడ్డి తెచ్చుకుంటున్నారన్నారు. దళిత ప్రజలపై వైసీపీ దాడులకు దిగుతోందని ఆరోపించారు. వారందరికీ తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుందన్నారు. ఈకేసు నుంచి అనంతబాబును తప్పించేందుకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సుబ్రమణ్యం కుటుంబాన్ని ప్రలోభపరిచారని, రూ.2 కోట్ల నగదు ఇస్తామన్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications