తమిళనాడులో రెండురోజుల పాటు నారా లోకేష్ ఎన్నికల ప్రచారం.. ఎవరికోసమో తెలుసా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో టిడిపి, బిజెపి, జనసేన కూటమి విజయం సాధించడం కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తాజాగా తమిళనాడులోనూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. బిజెపి అధ్యక్షుడు కోయంబత్తూర్ లోక్సభ అభ్యర్థి అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేడు, రేపు కోయంబత్తూర్ లో పర్యటించి పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నారు.

తమిళనాట లోకేష్ ఎన్నికల ప్రచారం
ఎన్డీఏ కూటమి విజయం కోసం తన వంతుగా లోకేష్ తమిళనాడులో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రదేశాలలో లోకేష్ ఎన్నికల ప్రచారం సాగనుంది. తమిళనాడు రాష్ట్రంలో తెలుగు మూలాలు ఉన్న ప్రజలు 40 శాతం మంది ఉంటారని రాజకీయ వర్గాల అంచనా. అయితే తెలుగు సాంప్రదాయాలను గౌరవించేవారు, తెలుగు భాష మాట్లాడేవారు తమిళనాడు రాష్ట్రంలో లక్షల సంఖ్యలోనే ఉంటారు.

Nara Lokesh election campaign for two days in Tamil Nadu coimbatore

తమిళనాడు బీజేపీ అభ్యర్థుల కోసం లోకేష్ ఎన్నికల ప్రచారం
వీరందరి మద్దతు కోసం తెలుగుకు ప్రాధాన్యతనిస్తూ, తమిళనాడు రాష్ట్రంలో తెలుగు రాజకీయ నాయకులను రంగంలోకి దింపి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బిజెపి తెలుగు ఓటర్ల మద్దతు కోసం టిడిపి నాయకులను ప్రచారానికి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో నారా లోకేష్ నేడు, రేపు అక్కడ నిర్వహించే ప్రచార సభలలో పాల్గొంటారు.

బీజేపీకి మద్దతుగా లోకేష్ ప్రచారం.. వర్కవుట్ అవుతుందా?
సభలు, సమావేశాలు, రోడ్ షోలలో నారా లోకేష్ రెండు రోజుల పాటు బిజీగా ఉండనున్నారు. నేడు రాత్రి 7 గంటలకు పీలమేడులో ఏర్పాటు చేసిన సభలో లోకేష్ ప్రసంగిస్తారు. ఇక రేపు ఉదయం సింగనల్లూరు లోని ఇందిరా గార్డెన్స్ లో లోకేష్ అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. తమిళనాడులో బిజెపికి మద్దతుగా లోకేష్ చేయనున్న ప్రచారం బిజెపి నేతలకు ఏ మేరకు లబ్ధిని చేకూరుస్తుందో అన్న ఆసక్తికర చర్చ ప్రస్తుతం జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+