• search
 • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మాట‌త‌ప్పడం,మ‌డ‌మ‌తిప్పడం సీఎంకు అలవాటే.!అరాచక పాలనకు జగన్ బ్రాండ్ అంబాసిడ‌రన్న లోకేష్.!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : అస్త‌వ్య‌స్త‌మైన నిర్ణయాలు, విధ్వంసంతోకూడిన అరాచ‌క పాల‌న‌, రివ‌ర్స్ అడ్మినిస్ట్రేష‌న్‌, మాట త‌ప్పుడు, మ‌డ‌మ‌తిప్పుడుతో జ‌గ‌న్ ఆధునిక‌ తుగ్ల‌క్ గా పేరుగాంచార‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ విమ‌ర్శించారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం తాడేప‌ల్లిలోని మహానాడు, సుందరయ్య నగర్ లో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆకాశంలో ఉన్నసీఎం జగన్ భూమ్మీదకి దిగి వ‌చ్చిన‌ప్పుడే ప్ర‌జ‌ల‌ క‌ష్టాలు తెలుస్తాయ‌న్నారు. రెండున్నరేళ్లలో తాడేపల్లి ప్యాలస్ నుండి బయటకు అడుగు పెట్టలేద‌ని మండిపడ్డారు.

 తుపాను ప్రాంతాల్లో సీఎం పర్యటించారా.? ప్రజలకు భరోసా ఏంటన్న నారా లోకేష్

తుపాను ప్రాంతాల్లో సీఎం పర్యటించారా.? ప్రజలకు భరోసా ఏంటన్న నారా లోకేష్

అంతే కాకుండా హుద్ హుద్, తిత్లీ వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు వరద ప్ర‌భావిత‌ ప్రాంతాల‌కు వెళ్లి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ అక్కడే ఉండి వచ్చార‌ని గుర్తు చేశారు. తిత్లీ వచ్చినప్పుడు 21 రోజుల్లో వెయ్యి కోట్ల నష్ట పరిహారాన్ని రైతులకు అందజేసిన ఘ‌న‌త తెలుగుదేశం ప్ర‌భుత్వానిద‌న్నారు. ఇప్పుడు కనీసం నష్ట పరిహారం అంచనా వేసే నాధుడు కూడా ముంపు ప్రాంతాల‌కు రాలేదంటే, ప్ర‌జ‌ల ప‌ట్ల ఎంత నిర్ల‌క్ష్యంగా వుంటున్నారో అర్థ‌మ‌వుతోంద‌న్నారు. పంట‌లు న‌ష్ట‌పోయిన రైతాంగానికి తక్షణమే పరిహారం అందించాల‌ని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

 ప్రజల సమస్యలు అసలే పట్టని జగన్.. ఘాటుగా విమర్శించిన లోకేష్

ప్రజల సమస్యలు అసలే పట్టని జగన్.. ఘాటుగా విమర్శించిన లోకేష్

కాగా రాష్ట్రానికి ఒక్క కొత్త‌ పరిశ్రమా రాలేద‌ని, తమిళనాడులో ఇండస్ట్రియల్ సమ్మిట్ పెడితే 25 వేల కోట్ల పెట్టుబడులు ఆ రాష్ట్రానికి వెళ్లాయంటే పాల‌న ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు , విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు చాల‌వ‌న్న‌ట్టు ఇప్పుడు మళ్లీ వాహన రిజిస్ట్రేషన్ మీద పన్నుపెంచి ప్రజలపై రోజురోజుకీ భారాల‌ని పెంచుకుంటూ పోతున్నార‌ని నారా లోకేష్ ఆరోపించారు.
ఎన్నిక‌ల‌కి ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని జ‌గ‌న్‌రెడ్డి సక్రమంగా అమలు చెయ్యలేద‌ని ఘాటుగా విమర్వించార నారా లోకేష్.

 అభివృద్ధికి దూర‌మైన మంగ‌ళ‌గిరి.. చాలా దారుణమన్న లోకేష్

అభివృద్ధికి దూర‌మైన మంగ‌ళ‌గిరి.. చాలా దారుణమన్న లోకేష్


జగన్ రెడ్డికి ఏ సబ్జెక్ట్ మీదా అవగాహన లేద‌ని, మూడురాజ‌ధానులు, సీఆర్డీఏ ర‌ద్దు, శాస‌న‌ మండ‌లిని ర‌ద్దు చేసి తిరిగి అవే చ‌ట్టాల‌ను మ‌ళ్లీ కావాలనుకోవడం తుగ్ల‌క్ చ‌ర్య‌లు కాక‌పోతే ఇంకేంట‌ని ప్ర‌శ్నించారు. ద‌క్షిణాఫ్రికా లెక్క అన్నార‌ని, మూడు రాజ‌ధానుల‌తో అభివృద్ధి అన్నారని, తీరా చ‌ట్టాల‌నే వెన‌క్కి తీసుకోవ‌డం జ‌గ‌న్ ఇచ్చిన మాట త‌ప్ప‌డం, మ‌డ‌మ తిప్ప‌డానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ అని స్ప‌ష్ట‌మైంద‌న్నారు. ముఖ్యమంత్రి నివాసం ఉండే నియోజకవర్గమైన మంగ‌ళ‌గిరి కూడా అభివృద్ధికి దూరం కావ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. సీఎం ఇచ్చే ప్ర‌క‌ట‌న‌ల అభివృద్ధి అంతా పేపర్లకే పరిమిత‌మైంద‌న్నారు.

  Vijayawada లో Sonu Sood కి ఊహించని క్రేజ్.. Amaravati రైతులకి మాటిచ్చిన సోనూ || Oneindia Telugu
   అంతా వెనుకబాటు తనమే.. ఎక్కడా అభివృద్ది లేదన్న నారా లోకేష్..

  అంతా వెనుకబాటు తనమే.. ఎక్కడా అభివృద్ది లేదన్న నారా లోకేష్..

  మూడురోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బుధ‌వారం మహానాడు, సుందరయ్య నగర్, ప్రాతూరు ప్రాంతాల్లో నారా లోకేష్ సంద‌ర్శించారు. ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వేర్వేరు ప్రాంతాల‌లో త‌న‌ను క‌లిసిన ప్రజల స‌మ‌స్య‌లు విని, ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. విద్యుత్ బిల్లు ఎక్కువొచ్చిందని, రకరకాల కారణాలు చూపి పెన్షన్, రేషన్ కార్డు, సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తున్నారంటూ మహానాడు ప్రాంత ప్రజలు లోకేష్‌కి ఎదుట వాపోయారు. తాడేపల్లి ప్రాంతానికి తాగునీరు అందించేందుకు టీడీపీ ప్రభుత్వం 110 కోట్లు కేటాయిస్తే, క‌మీష‌న్ల కోసం వైసీపీ స‌ర్కారు ఆ ప్రాజెక్ట్‌నే నిలిపేసింద‌ని ఆరోపించారు.

  English summary
  Jagan Reddy questioned whether there was any understanding on any subject and whether the three capitals, the abolition of the CRDA, the repeal of the Legislative Council and the re-enactment of the same Act were not Tughlaq actions.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X