పోలీసుల అదుపులో లోకేశ్-నర్సరావుపేటకు నో పర్మిషన్ : టీడీపీ నేతల హౌస్ అరెస్ట్-టెన్షన్..!!
విజయవాడ: టీడీపీ యువ నేత..పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సరావుపేటలో హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, లోకేశ్ కు నర్సరావుపేట వెళ్లేందుకు అనుమతి లేదంటూ విమానశ్రయం వద్దనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కొడాలి నాని నియోజకవర్గం గుడివాడ నందివాడ పోలీసు స్టేషన్ ను తరలిస్తున్నట్లుగా సమాచారం.
లోకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..@naralokesh #hyderabad #chandrababunaidu #oneindiatelugu pic.twitter.com/GgnID0MXeA
— oneindiatelugu (@oneindiatelugu) September 9, 2021

లోకేశ్ అదుపులోకి...పర్యటనకు నో
అయితే, లోకేశ్ తనను అడ్డుకోవటం పైన అభ్యంతరం వ్యక్తం చేసారు. తన పర్యటన పైన అభ్యంతరం ఉంటే తనను పార్టీ కార్యాలయానికి లేదా నివాసానికి వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలంటూ పోలీసులను కోరారు. అయితే, పోలీసులు లోకేశ్ ను గుడివాడ వైపు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి దేవినేని ఉమా ను ముందస్తుగా అరెస్ట్ చేసిన పోలీసులు ఇదే పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్కడ నుంచి లోకేశ్ ను అనూష పుట్టినరోజును అమె గృహంలో లేదా స్థానిక టీడీపీ కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమంలో లోకేశ్ పాల్గొని ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపేలా కార్యక్రమాన్ని రూపొందించారు.

టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్..
ఈ క్రమంలో లోకేశ్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బుధవారం టీడీపీ నేతలు దరఖాస్తు ఇచ్చేందుకు వెళ్లగా పోలీసు అధికారులు నిరాకరించారు. లోకేశ్ పర్యటన పైన టీడీపీ- వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. ఇదే మయంలో పోలీసు అధికారులు సైతం లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలను పోలీసులు మందుగానే హౌస్ అరెస్ట్ చేసారు.

నర్సరావుపేటలో టెన్షన్
దివంగత స్పీకర్ కోడెల కుమారుడు శివరామ్ తో పాటుగా నర్సరావు పేట టీడీపీ ఇన్ ఛార్జ్ డాక్టర్ అరవిందబాబు, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులును బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. బాధితులకు అండగా లోకేశ్ ఆందోళన చేస్తుంటే మీరెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. లోకేశ్ నరసరావుపేటకు వస్తారని, అనూష కుటుంబాన్ని పరామర్శిస్తారని జీవీ అంజనేయులు తెలిపారు.

రాజకీయం చేస్తామంటే అనుమతి లేదంటూ..
మరోవైపు పిడుగురాళ్లకు చెందిన టీడీపీ నేతలకు లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని, పాల్గొనడానికి రావద్దని పోలీసులు సందేశాలు పంపారు. నరసరావుపేటలో లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమవర్మ తెలిపారు. కొవిడ్ నిబంధనలతోపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రాజకీయపరమైన కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. మహిళలపై జరిగే నేరాలను రాజకీయం చేయవద్దని సూచించారు. రమ్య కేసు విషయంలోనూ ఇదేవిధంగా రాజకీయం చేశారన్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications