ఉపాధ్యాయుల బదిలీలపై మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు!!

నారా లోకేష్ విద్యా శాఖా మంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరిగాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో మంత్రి లోకేష్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.

రాజకీయ ఒత్తిళ్ళకు తావు లేని బదిలీలు చెయ్యాలి
ఉపాధ్యాయుల బదిలీల విషయంలో గతంలో మాదిరి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా చూడాలని, తదనుగుణంగా విధివిధానాలని రూపొందించాలని లోకేష్ కమిషనర్ ను ఆదేశించారు. ఈ విషయంలో ఏకపక్షంగా కాకుండా ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు బోధన కాకుండా అదనపు పనులు, అనవసరమైన యాప్ ల భారాన్ని తగ్గించాలన్నారు.

Nara Lokesh key directions on teachers transfers

స్కూల్స్ లో మౌలిక సదుపాయాల కల్పనపై లోకేష్ ఆరా
ఉపాధ్యాయులు పూర్తిస్థాయి బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎన్ని నిధులు అవసరమవుతాయనే అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే సమీక్షలో మూసివేసిన పాఠశాలలకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలన్నారు.

విద్యా ప్రమాణాల పెంపుకు అధ్యయనం చెయ్యాలన్న లోకేష్
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు పెద్దఎత్తున విద్యార్థులు వెళ్ళిపోవటానికి కారణాలు అన్వేషించి సమగ్ర నివేదిక అందించాలన్నారు. దీంతో పాటు చిల్డ్రన్ లెర్నింగ్ అవుట్ కమ్స్, విద్యా ప్రమాణాల పెంపుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు.

రాయలసీమలో స్కూల్స్ కొరతపై వివరాలు తీసుకున్న లోకేష్
గతం కంటే మెరుగ్గా విద్యా వ్యవస్థ ఉండాలని లోకేష్ సూచించారు. విద్యా ప్రమాణాల పెంపుకు దేశంలో అత్తుత్తమ విధానాలు ఎక్కడ అమలవుతున్నాయో అధ్యయనం చేసి నివేదిక అందించాలని అధికారులను కోరారు. జర్మనీ, ఆస్ట్రియాతోపాటు పలు అభివృద్ధి చెందిన దేశాల విద్యా వ్యవస్థలను స్టడీ చెయ్యాలన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ పాఠశాలల కొరత ఉంది, ఎక్కడ నూతన పాఠశాలలు ప్రారంభించాలనే అంశాలపైనా ఈ సమావేశంలో అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+