నారా లోకేష్ పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ సూపర్ ట్విస్ట్..? ఎవరయ్యుంటారు?

పీలేరు సభలో నారా లోకేష్ వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తతం అన్నమయ్య జిల్లా పీలేరులో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా పట్టణంలో జూనియర్ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రాజకీయంగా కలకలం రేకెత్తించింది. అన్న పెట్టిన పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ ఆ ఫ్లెక్సీల్లో రాసివుంది. పీలేరులోని పలు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. వెంటనే టీడీపీ శ్రేణులు ఆ ఫ్లెక్సీలను తొలగించారు.

ఒక్కడి కోసం వెయ్యి మంది పోలీసులా?

ఒక్కడి కోసం వెయ్యి మంది పోలీసులా?

పీలేరు సభలో నారా లోకేష్ వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ఒక్క ఛాన్స్ ఇవ్వడంవల్ల మన జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. తాను యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ముఖ్యమంత్రికి నిద్రపట్టడంలేదని, తన పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారని, ఒక్క లోకేష్ ను ఆపడానికే 1000 మంది పోలీసులు, 6 డీఎస్పీలు, 20 మంది సీఐలు, ఇంటిలిజెన్స్ అధికారులు పనిచేస్తున్నారన్నారు.

2025లో జాబ్ క్యాలెండర్ ఇప్పించే బాధ్యత నాది

2025లో జాబ్ క్యాలెండర్ ఇప్పించే బాధ్యత నాది

2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2025 జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. జగన్ పరిపాలనలో పోలీసులు కూడా బాధితులుగా మారారని, 4 సరెండర్లు, 8 టీఏ, డీఏలు పెండింగ్ లో పెట్టారని మండిపడ్డారు. 400 రోజులపాటు తాను ప్రజల మధ్యే ఉంటానని, తనను అడ్డుకోవడానికి మైక్, స్టూల్, సౌండ్ వెహికల్ లాక్కుంటున్నారని విమర్శించారు.జాబ్ క్యాలెండర్ ఇస్తానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ చివరకు సున్నా ఇచ్చారన్నారు.

పోలీసుల సమస్యలను పరిష్కరించేది కూడా తామే

పోలీసుల సమస్యలను పరిష్కరించేది కూడా తామే

2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతోపాటు పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేది కూడా తామేనన్నారు. విశాఖపట్నంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కాదని, లోకల్ ఫేక్ సమ్మిట్ అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చినవారు బహుమతుల కోసం కొట్టుకున్నారని, కాగితాల్లేకుండా ఫేక్ ఎంవోయూలు చేసుకున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో తెచ్చిన అమర్ రాజా, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లులూ వంటి పెద్ద పెద్ద కంపెనీలను జే ట్యాక్స్ కోసం తరిమేశారని, పెట్టుబడులు పెడుతున్నామంటూ అందరిచేత అబద్దాలు చెప్పిస్తున్నారని మండిపడ్డారు.

ప్రజలకు చింతలే మిగులుతున్నాయి

ప్రజలకు చింతలే మిగులుతున్నాయి

పీలేరు నియోజకవర్గంలో రూ.500 కోట్ల విలువైన 200 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నిస్తే కిషోర్ కుమార్ రెడ్డి పోరాడి అడ్డుకున్నారని, చింతల రామచంద్రారెడ్డిని ఇక్కడ రెండుసార్లు గెలిపిస్తే ప్రజలకు చివరకు మిగిలింది చింతలేనన్నారు. నియోజకవర్గంలోని కొండలు, గుట్టలను దోచుకున్నారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే భారీగా పరిశ్రమలు తెచ్చి ఇక్కడి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లిని కలిపి ఒక ప్రత్యేక జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో లోకేష్ ఇప్పటి వరకు 458.5 కిలోమీటర్లు నడిచారు. యాత్ర 36వ రోజుకు చేరుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+