Nara Lokesh: అమెరికాలో అరెస్టు ప్రచారంపై స్పందించిన లోకేష్..! అన్నీ జగన్ కే తెలుసు..
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ప్రత్యర్ధి పార్టీ నేతలకు సంబంధించి ఏదైనా చిన్న పాయింట్ దొరికితే దాన్ని రాజకీయంగా వాడుకునేందుకు నేతలు, పార్టీలు సిద్దమైపోతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అయింది. ఇందులో నారా లోకేష్ అమెరికాలో ఓ మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయ్యారనేది ఈ వార్తల సారాంశం.
అమెరికాలో మనీలాండరింగ్ కేసులో తనను పోలీసులు అరెస్టు చేశారంటూ జరుగుతున్న ప్రచారంపై ఇవాళ నారా లోకేష్ స్పందించారు. హైదరాబాద్ నుంచి గన్నవరానికి విమానంలో వచ్చిన నారా లోకేష్.. తన అరెస్టుకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అమెరికాలో అరెస్టు చేసింది నన్నా.. జగన్ రెడ్డినా అని ప్రశ్నించారు. దీనిపై మీడియా మరింతగా ప్రశ్నిస్తే.. అమెరికాలో అరెస్టు చేసింది జగన్ రెడ్డినా, జగన్ కూతురినా, భారతీ రెడ్డినా అని లోకేష్ అడిగారు. మనీలాండరింగ్, అరెస్టులు అన్నీ జగన్ కే తెలుసన్నారు.

అమెరికాలో అరెస్టు ప్రచారంపై స్పందించిన లోకేష్..!!!#NaraLokesh #TDP #Oneindiatelugu pic.twitter.com/oIkPXTJxmr
— oneindiatelugu (@oneindiatelugu) January 27, 2024
తనపై జరుగుతున్న ప్రచారంపై సీరియస్ అయిన నారా లోకేష్.. తన మీద సోషల్ మీడియా లో ట్రోల్ చేసిన గాడిదలను అరెస్టుపై అడగాలంటూ వ్యాఖ్యానించారు. తద్వారా ఈ వార్తలన్నీ ఫేక్ అని ఆయన క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా లోకేష్ ఎక్కువగా కనిపించకపోవడంతో ఆయన అమెరికా వెళ్లారని, అక్కడ అరెస్టు అయ్యారనే ప్రచారాన్ని వైసీపీ సోషల్ మీడియాలో తెరపైకి తెచ్చింది. దీనిపై వెంటనే టీడీపీ నుంచి రియాక్షన్ రాకపోవడంతో నిజమేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి. దీనిపై ఇవాళ లోకేష్ క్లారిటీతో ఈ ఫేక్ ప్రచారానికి తెరపడుతుందని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications