మీసం మెలేసిన నారా లోకేష్ -కట్ డ్రాయర్‌తో ఊరేగిస్తాం..!!

టీడీపీ నేత నారా లోకేష్ మీసం మెలేసారు. వైసీపీ నేతల తోలు తీయడం పెద్ద లెక్క కాదని హెచ్చరించారు.

టీడీపీ నేత నారా లోకేష్ మీసం మెలేసారు. వైసీపీ నేతల తోలు తీయడం పెద్ద లెక్క కాదన్నారు. చంద్రబాబు చిటికేస్తే వైసీపీ వాళ్లు ఎవరూ ఉండరని వార్నింగ్ ఇచ్చారు. తమ సహనాన్ని పరీక్షించవద్దన్నారు. దాడులు చేసేవారిని కట్‌డ్రాయర్లతో ఊరేగింపు చేయిస్తా... బీకేర్‌ఫుల్‌ అంటూ హెచ్చరించారు. తాము ప్రజాస్వామ్య యుతంగా ఉన్నామని చెప్పారు. రాబోయేది మా టీడీపీ ప్రభుత్వమే. పోలీసులకు పోస్టింగులు ఇచ్చేది నేనే.. అది గుర్తుంచుకోండి అంటూ లోకేష్ వరుస హెచ్చరికలతో విరుచుకుపడ్డారు.

సహనాన్ని పరీక్షించొద్దు

సహనాన్ని పరీక్షించొద్దు

యువగళం పాదయాత్రలో భాగంగా శ్రీకాళహస్తిలో నారా లోకేష్ వైసీపీ నేతలకు హెచ్చరికలు చేసారు. తనను అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అతి చేసే వైసీపీ నేతల తోలు తీయటం లెక్క కాదంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు చిటికేస్తే వాళ్లు ఎవరూ ఉండరని వార్నింగ్ ఇచ్చారు. గతంలో టీడీపీ కార్యాలయం పైన దాడి చేసారన్నారు. ఇప్పుడు గన్నవరం కార్యాలయం పైన విరుచుకుపడారని మండిపడ్డారు. దాడులు చేసిన వారు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వెతికి తీసుకొస్తామన్నారు. తాను దమ్ము ధైర్యంతో మీసాలు తిప్పి చెబుతున్నానని.. సహనాన్ని పరీక్షించవద్దన్నారు. దాడులు చేసేవారిని కట్‌డ్రాయర్లతో ఊరేగింపు చేయిస్తా... బీకేర్‌ఫుల్‌ అంటూ లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

రాహుల్ గాంధీ తరువాత నేనే

రాహుల్ గాంధీ తరువాత నేనే

లోకేష్ యువగళం పాదయాత్ర 24వ రోజు బుధవారం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) పనిచేస్తున్నట్టు కనిపించలేదు. ఆర్బీకేలు ఒక పనికిమాలిన పథకం. భూసార పరీక్షా కేంద్రాలు పెడతానని జగన్‌ రెడ్డి మాటతప్పారని ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే కేంద్రాన్ని ఒప్పించి వ్యవసాయ రంగాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తామన్నారు. ఎన్నికల ముందు మద్యనిషేధం హామీ ఇచ్చిన ఆయన కుర్చీ ఎక్కగానే లిక్కర్‌ కింగ్‌ అవతారమెత్తారని ఆరోపించారు.మహిళలు పసుపు చీర కట్టుకున్నా పెయిడ్‌ ఆర్టిస్టులని ట్రోల్‌ చేస్తారంటూ లోకేష్ ఎద్దేవా చేసారు. దేశంలో రాహుల్‌గాంధీ తర్వాత అతిఎక్కువ ట్రోలింగ్‌కు గురైంది తానేనని.. వాళ్లు ఎంత ట్రోల్‌ చేస్తే అంత బలపడతానని లోకేశ్‌ అన్నారు. రూ.2,200 కోట్ల పెట్టుబడితో 8వేల మందికి ఉద్యోగాలు కల్పించే టీసీఎల్‌ కంపెనీ తాను తీసుకొచ్చానంటూ లోకేష్ గుర్తు చేసారు.

పోలీసులతో లోకేష్ వాగ్వాదం

పోలీసులతో లోకేష్ వాగ్వాదం

ఎమ్మెల్యే ఇసుక దోపిడీ చేస్తే కేసు ఉండదు కానీ, తాను స్టూల్ ఎక్కి మాట్లాడితే కేసు పెడతారా అంటూ పోలీసు అధికారులతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. చట్టాలు కొంతమంది చుట్టాలు అవుతున్నాయని మండి పడ్డారు. వైసీపీ అధికారంలోకొచ్చిన నాటి నుంచి క్రాప్‌ హాలిడే, పవర్‌ హాలిడే, ఆక్వా హాలిడేనే... వీటితో రైతులు తీవ్రంగా నష్టపోయారని లోకేష్ చెప్పుకొచ్చారు. అందుకే జగన్‌ ఒక హాలిడే సీఎం అంటూ లోకేష్ విమర్శించారు. మోటార్లకు మీటర్లు తెచ్చి రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని మండిపడ్డారు. గంజాయి పండించేవాళ్లకు గిట్టుబాటు ధర ఇస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ హయాంలో విజయవంతంగా అమలైన ఉచిత ఇసుక విధానాన్ని రద్దుచేసి, కొత్త విధానం అమలు చేసిన వైసీపీ సర్కారు దెబ్బకి ఇసుక కొనాలంటేనే బంగారమైపోయేలా చేశారని ఆరోపించారు. ఉన్న కంపెనీలను తరిమేసే జగన్‌కు నిరుద్యోగ యువత ఇబ్బందులు ఏం తెలుసని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+