నేను కారు కొనాలంటే బ్రహ్మణి డబ్బులివ్వాల్సిందే - మంగళగిరిలో లోకేష్ కామెంట్స్..

టీడీపీ యువనేత నారా లోకేష్ ఇవాళ మంగళగిరిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. స్ధానికంగా ''స్త్రీ శక్తి'' కార్యక్రమంలో భాగంగా టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సులు పూర్తిచేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు, వారి స్వయం ఉపాధి కోసం టైలరింగ్ మెషీన్లు ఉచితంగా అందజేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ రోజుల్లో స్త్రీలు తమ కుటుంబాల్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తున్నారనే అంశంపై లోకేష్ తన అభిప్రాయాల్ని మంగళగిరిలో స్ధానిక మహిళలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్..తన ఇంట్లో సంగతుల్ని ఉదాహరణగా చెప్పారు. స్త్రీశక్తికి తమ ఇల్లు ఉదాహరణ అని లోకేష్ తెలిపారు. తన తల్లి భువనేశ్వరి తమ కుటుంబానికి ఆదర్శమని లోకేష్ తెలిపారు. తన భార్య, తన తల్లి వ్యాపారాన్ని పైకి తీసుకొచ్చారని, ఇప్పుడు తాను కారు కొనాలంటే బ్రాహ్మణి ఫైనాన్స్ ఇవ్వవలసిన పరిస్థితి ఉందని లోకేష్ గర్వంగా చెప్పారు.

Recommended Video

    బీజేపీ - టీడీపీ పొత్తు, తేల్చేసిన కాషాయం సీనియర్ నేత *National | Telugu OneIndia
    nara lokesh shocking comments- wife brahmani has to give money for my new car

    మంగళగిరిలో మహిళల్ని ప్రోత్సహించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాల గురించి లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ పనులు చేయడానికి తమకు అధికారం అవసరం లేదన్నారు. మహిళా శక్తి అభ్యున్నతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మంచి చేయడానికి అధికారం అవసరం లేదని, స్వంతంగా ఇంత మందికి శిక్షణ ఇప్పించగలిగానని, రేపు అధికారం లోకి వస్తే లక్షలాది మందికి శిక్షణ ఇప్పిస్తామని లోకేష్ పేర్కొన్నారు. తాము ఇస్తున్న శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని లోకేష్ కోరారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+