నేడే నారా లోకేష్ ప్రమాణ స్వీకారం
నేడు.. తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఆ పార్టీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం చేయబోతోంది. టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేష్ ప్రమాణం చేయనున్నారు. పార్టీ అధినేతగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. దీనికి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయం దీనికి వేదిక.
మొత్తం 252 మందితో ఇటీవలు టీడీపీ నూతన కార్యవర్గం ఏర్పాటైన విషయం తెలిసిందే. జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు వేర్వేరుగా నియమితులయ్యారు. పొలిట్‌బ్యూరో కూడా సభ్యుల సంఖ్య 29కి పెరిగింది. జాతీయ కమిటీలో 31 మందికి చోటు దక్కింది. వీరిలో 18 మంది జాతీయ ఉపాధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. 10 మందికి జాతీయ స్థాయి అధికార ప్రతినిధులు ఉన్నారు. మరో ముగ్గురికి జాతీయ ప్రధాన కార్యదర్శులుగా అవకాశం లభించింది.

పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కు కొనసాగనున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 16 మంది, ప్రధాన కార్యదర్శులు-7, అధికార ప్రతినిధులు- 15, జోనల్ కో-ఆర్డినేటర్లు- 10 అపాయింట్ అయ్యారు. వీళ్ల కాకుండా కార్యనిర్వాహక కార్యదర్శులు- 59, పార్టీ కార్యదర్శులు-77 మందికి అవకాశం ఇచ్చారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొత్త కార్యవర్గ సమావేశమౌతుంది.
మహానాడు నిర్వహణ, కూటమి ప్రభుత్వం జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టడం, పెట్టుబడులు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం.. వంటి అంశాలను ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. వాటిపై కొత్త కార్యవర్గానికి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. తమ ప్రభుత్వానికి ప్రజలే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించేలా చేయాలని గతంలో చంద్రబాబు స్పష్టం చేశారు కూడా.
కాఫీ కబుర్లు వంటి శిక్షణ తరగతులను మరింత విస్తృతంగా నిర్వహించడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడానికి అవసరమైన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి తాజా కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. క్షేత్రస్థాయి సంక్షేమ పథకాలపై అభిప్రాయాలనూ సేకరించడంతో పాటు, కార్యకర్తల కుటుంబాలకు విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి చర్చలపై ఇందులో చర్చించవచ్చు.












Click it and Unblock the Notifications