జగన్ కోసం లోకేష్ ఎదురుచూపులు..! మూడో రోజూ..! తాజా ఆఫర్..!

ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఇవాళ్టికి మూడో రోజు. అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan).. మండలికి మాత్రం ఎమ్మెల్సీలను పంపుతున్నారు. మరోవైపు మెగా డీఎస్సీ విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, జగన్ కానీ హాజరు కాని అసెంబ్లీలో చర్చ చేపట్టిన ప్రభుత్వం .. అక్రమాలు జరగలేదంటూ క్లీన్ చిట్ ఇచ్చుకుంది. కానీ వైసీపీ ఎమ్మెల్సీలు హాజరవుతున్న మండలిలో మాత్రం చర్చకు సిద్దం కావడం లేదు. దీనిపై ఇప్పటికే మండలిలో వైసీపీ వర్సెస్ కూటమిగా వాగ్యుద్దాలు కొనసాగుతున్నాయి.

మెగా డీఎస్సీపై తేల్చేసిన లోకేష్..! అసెంబ్లీలో ప్రకటన..!
మెగా డీఎస్సీపై తేల్చేసిన లోకేష్..! అసెంబ్లీలో ప్రకటన..!

ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీపై చర్చకు అసెంబ్లీ ప్రారంభమైన తొలిరోజే చర్చకు రావాలంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సవాల్ విసిరిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh).. ఆయన రాకపోవడంతో అసెంబ్లీలో చర్చను చేపట్టి, తన వాదన చెప్పేశారు. అయినా ఇంకా జగన్ రాకపోవడంతో ఏదో వెలితిగా భావిస్తున్నట్లున్నారు. దీంతో నారా లోకేష్.. ఇప్పుడు జగన్ ను ఇప్పటికైనా చర్చకు రావాలని, తాను మూడు రోజులుగా ఎదురుచూస్తున్నట్లు ఇవాళ ట్వీట్ చేశారు. దానికి స్టిల్ వెయిటింగ్ అంటూ ఓ ఎమోజీని కూడా జత చేశారు.

Nara Lokesh Takes Fresh Swipe at YS Jagan Over DSC Debate Says Waiting for Third Day
మండలిలో వైసీపీకి హ్యాట్రిక్..! కూటమి మళ్లీ చేతులెత్తేసిందా ?
మండలిలో వైసీపీకి హ్యాట్రిక్..! కూటమి మళ్లీ చేతులెత్తేసిందా ?

డీఎస్సీ అంశంపై చర్చకు తాను విసిరిన సవాలును జగన్ గారు అంగీకరించేలా ఇంకా వేచి చూస్తున్నానప- ఇది మూడవ రోజు అంటూ నారా లోకేష్ ఇవాళ ట్వీట్ చేశారు. అలాగే విషయం నాకు అర్థమైంది - నేను 'మొదటిసారి ఎమ్మెల్యే'ని, ఆయన 'మాజీ ముఖ్యమంత్రి'. అందుకే ఆయనకు 'హోమ్ అడ్వాంటేజ్' (ఆయనకు అనుకూలమైన వేదికను ఎంచుకునే అవకాశం) ఇవ్వడానికి కూడా నేను సిద్ధమే. వేదిక ఆయన ఇష్టమే. అంటూ ఓ ఆఫర్ కూడా ఇచ్చారు. మరి, ఆయన చర్చకు వస్తారా? అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+