పవన్ అన్నకు.. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేళ లోకేష్ ట్వీట్..!
ఏపీలో జనసేన పార్టీ ఇవాళ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. 2014లో ప్రస్ధానం ఆవిర్భవించిన జనసేన పార్టీని అధినేత పవన్ కళ్యాణ్ ఈ 12 ఏళ్ల ప్రస్ధానంలో బలీయమైన శక్తిగా నిలబెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించిన 100 శాతం స్ట్రైక్ రేట్ విజయం చరిత్రలో నిలిచిపోతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ పిఠాపురంలో ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలు భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జనసేనకు శుభాకాంక్షలు చెబుతూ టీడీపీ మంత్రి నారా లోకేష్ ఓ ట్వీట్ చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటోతో కూడిన ట్వీట్ చేసిన నారా లోకేష్.. ఇందులో పలు కీలక విషయాలను ప్రస్తావించారు. పవన్ పిడికిలి బిగించిన ఫొటోను ఇందులో లింక్ చేశారు. అందులో సాధించిన విజయాలు స్మరించుకుందాం..భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసుకుందాం అంటూ జనసేన ఆవిర్భావ సభ థీమ్ ను పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లుగా ఈ ఫొటో ఉంది. ఈ ఫొటోను తన ట్వీట్ కు లింక్ చేసిన లోకేష్.. కీలక వ్యాఖ్యలు చేశారు.

On @JanaSenaParty’s 12th Foundation Day, I extend my warm and heartfelt wishes to @pawankalyan Anna, leaders, workers and followers. Jana Sena's commitment to Andhra Pradesh's economic and social growth is truly commendable, and their role in driving progress and prosperity in… pic.twitter.com/Fb4amAgchP
— Lokesh Nara (@naralokesh) March 14, 2025
జనసేన పార్టీ 12వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, పవన్ కళ్యాణ్ అన్నకు, నాయకులు, కార్మికులు, అనుచరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సామాజిక వృద్ధికి జనసేన నిబద్ధత నిజంగా ప్రశంసనీయం అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమాన్ని నడిపించడంలో వారి పాత్ర నిస్సందేహంగా అందరికీ ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందనంటూ లోకేష్ తన ట్వీట్ ముగించారు. గత ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాక పవన్ కళ్యాణ్ ను అన్నగా సంబోధిస్తున్న లోకేష్.. ఈ ట్వీట్ లోనూ ఆ ట్రెండ్ కొనసాగించారు.












Click it and Unblock the Notifications