జగన్ రెడ్డి గుర్తు పెట్టుకో .. రేపు అధికారంలోకి వచ్చేది టీడీపీనే : నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి హయాంలో అరాచకాలు పెరిగిపోయాయని, అరాచకాలలో బీహార్ తో ఏపీ పోటీ పడుతోందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడులో ఇటీవల మరణించిన టీడీపీ నాయకుడు గరికపాటి కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన నారా లోకేష్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈరోజు టిడిపి నేత నారా లోకేష్ సత్తెనపల్లి చేరుకున్నారు. కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం ఆధ్వర్యంలో లోకేష్ కు కార్యకర్తలు స్వాగతం పలికారు. సత్తెనపల్లి నుండి భారీ ర్యాలీగా లక్కరాజు గార్లపాడు కి వెళ్ళిన లోకేష్ లక్కరాజు గార్లపాడు లో గరికపాటి కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన కృష్ణారావు ఆ తర్వాత చికిత్స పొందుతూ మరణించారు.ఈ నేపథ్యంలో కృష్ణారావు కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు . ఆ కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్ వారికి అండగా టీడీపీ ఉంటుందని చెప్పారు . మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

టిడిపి నేత కృష్ణారావు హత్య సీఎం జగన్ అరాచక పాలనకు నిదర్శనమని లోకేష్ ఆరోపించారు. ఇదే సమయంలో జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో అంటూ హెచ్చరికలు జారీ చేసిన లోకేష్ రేపు అధికారంలోకి వచ్చేది టిడిపినేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వైసీపీ నేతలు చేస్తున్న దానికి వడ్డీతో సహా చెల్లిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళ హోంమంత్రిగా ఉన్నా మహిళలకు ఎలాంటి రక్షణ లేదని లోకేష్ పేర్కొన్నారు. పోలీసులు లేకుండా జగన్ ప్రజల్లోకి రావొద్దని, అలా వస్తే తరిమి కొడతారు లోకేష్ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు .












Click it and Unblock the Notifications