లోకేష్ కు విజయమ్మ- జగన్ కు పవన్ ఆప్తులైన వేళ..!
ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, వైఎస్ జగన్, వైఎస్ షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ (ys vijayamma)పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా ఆమెకు పలువురు హితులు, సన్నిహితులు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇదే క్రమంలో ఆమె పిల్లలు వైఎస్ జగన్ (ys jagan), వైఎస్ షర్మిల (ys sharmila)కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారని అంతా ఆశిస్తారు. కానీ కూతురు వైఎస్ షర్మిల మాత్రమే విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ మాత్రం మౌనంగా ఉండిపోయారు.
ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన అమ్మకు 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు! అంటూ వైఎస్ షర్మిల ఇవాళ తాను విజయమ్మతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ విషెస్ తెలిపారు. "నాకు నడవడం నేర్పించడం నుండి జీవితంలోని ప్రతి అడుగులో నన్ను ప్రోత్సహించడం వరకు, నువ్వే నా ఆధారం, నా మార్గదర్శి, నా బలం. నీ ప్రేమకు, జ్ఞానానికి, అంతులేని త్యాగాలకు ధన్యవాదాలు. ఈ కొత్త దశాబ్దం నీకు శాంతిని, ఆరోగ్యాన్ని, నీకు అవసరమైనంత ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ రోజు, ప్రతి రోజూ నిన్ను వేడుక చేసుకుంటున్నాను. ❤️ మాటల్లో చెప్పలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను! 💕 దేవుడు నిన్ను దీవించుగాక అమ్మా!!" అని షర్మిల తెలిపారు.

Wishing @PawanKalyan Garu a speedy and complete recovery following his surgery. Get well soon!
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2026
Warm birthday greetings to Smt. Y. S. Vijayamma garu. Wishing her good health and happiness on this occasion. pic.twitter.com/eMuuks8sEr
— Lokesh Nara (@naralokesh) April 19, 2026
మరోవైపు జగన్ శుభాకాంక్షలు చెప్పకపోయినా, ఆయన రాజకీయ ప్రత్యర్థి, మంత్రి నారా లోకేష్ (nara lokesh) విజయమ్మకు విషెస్ చెప్పారు. శ్రీమతి వై. ఎస్. విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో ఆమె మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాము అంటూ లోకేష్ ట్వీట్ లో పేర్కొన్నారు. అటు విజయమ్మ బర్త్ డేకు కనీసం ట్వీట్ లోనూ శుభాకాంక్షలు చెప్పని వైఎస్ జగన్ మాత్రం .. నిన్న సర్జరీ చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు లోకేష్ విజయమ్మకు పెట్టిన ట్వీట్, జగన్ పవన్ కు పెట్టిన ట్వీట్ తో పోలుస్తూ రాజకీయ పార్టీల కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications