టీడీపీ కోసం ప్రచారానికి మరో స్టార్ క్యాంపెయినర్... నేటి నుండి నారా రోహిత్ ప్రచార షెడ్యూల్

ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రచార పర్వంలో దూకుడు పెంచింది. జాతీయ నేతలతో, స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారం కొనసాగిస్తుంది. ఈసారి విజయం సాధించటం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీడీపీ దాని కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది . అందుకోసం మరో స్టార్ క్యాంపెయినర్ రంగంలోకి దిగటానికి రెడీ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నారావారి హీరో నారా రోహిత్ ఓకే అన్నారు . తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసేందుకు నేటి నుండి స్టార్ క్యాంపెయినర్ గా నారా రోహిత్ బరిలోకి దిగనున్నారు .

నారా రోహిత్ ప్రచార షెడ్యూల్ ఇదే .. వారం రోజుల పాటు నారా వారి హీరో ప్రచారం

నారా రోహిత్ ప్రచార షెడ్యూల్ ఇదే .. వారం రోజుల పాటు నారా వారి హీరో ప్రచారం

ఏప్రిల్ 3 నుంచి 9వరకు అంటే దాదాపు వారం రోజులపాటు ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 3 అంటే నేడు రాజమహేంద్రవరం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న నారా రోహిత్ నేడు రాజమహేంద్రవరం ,కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 4 గురువారం పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. తణుకు, గురజాల, సత్తెనపల్లి, గుంటూరు జిల్లాల్లో ప్రచారం చేస్తారు.

నారా రోహిత్ ప్రచారంతో టీడీపీ లో కొత్త జోష్

నారా రోహిత్ ప్రచారంతో టీడీపీ లో కొత్త జోష్

ఇక ఏప్రిల్ 5న రేపల్లె, తెనాలి, పత్తిపాడులోనూ ఏప్రిల్ 6న చిలకలూరిపేట, పర్చూరు, చీరాలలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఏప్రిల్ 7న ఉరవకొండ, రాయదుర్గం, పుట్టపర్తి నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 8, 9న తన సొంత జిల్లా అయిన చిత్తూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని టీడీపీ అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపధ్యంలో టీడీపీ శ్రేణుల్లో నారా వారి హీరో ప్రచారం కొత్త జోష్ తెస్తుందని భావిస్తున్నారు.

నారా రోహిత్ ప్రచారంతో టీడీపీ కి లాభిస్తుందా

నారా రోహిత్ ప్రచారంతో టీడీపీ కి లాభిస్తుందా

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరపున నందమూరి హీరో తారకరత్న ఎన్నికల ప్రచారంలో దుమ్ముదులుపుతున్నారు. మరోవైపు వెంకటేష్ మేనమామ అశోక్ కుమార్ సైతం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు . తాజాగా నారా రోహిత్ ప్రచారపర్వంలో తన ఎంట్రీతో కొత్త ఉత్సాహాన్ని ఇవ్వబోతున్నారు . మరి నారా రోహిత్ ప్రచార ప్రభావం టీడీపీకి ఏ మేరకు లాభిస్తుందో వేచి చూడాలి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+